పుట్టిన వాడు గిట్టక తప్పదు.. ఈ సృష్టిలో జననం ఎలాగో కాలం చెల్లిన తర్వాత మరణం కూడా అలానే..మనిషి జీవిత చక్రం ఎప్పుడు ఆగుతుంది అనేది ఎవరూ చెప్పలేరు.అయితే కొందరు అంటున్నారు. చనిపోయే ముందు మాత్రం మనుషులు వింతగా ప్రవర్థిస్తారని అంటున్నారు..అందులో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ కొన్నిసార్లు అవి నిజాలు అయ్యాయని అంటున్నారు..ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం..
మరణించిన తర్వాత మరో ప్రపంచం ఉంటుందనే వాదనపై ఈ లోకంలో పలు రకాలైన సంగతులు ప్రచారంలో ఉన్నాయి. ఐతే దానిని చూసి వచ్చి ఇలా ఉంటుందని ప్రయోగ పూర్వకంగా చెప్పినవారు మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ లేదు.అలా మరణించి, మళ్ళీ బ్రతికి వచ్చి అక్కడ విషయాలను పంచుకొనే వాళ్ళు అయితే లేరు.అది కేవలం సినిమాలలో మాత్రమే జరుగుతుంది.మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వారి మెదడు స్థితి ఏమిటి? ప్రాణం ఏ విధంగా దేహాన్ని వీడుతుందనే విషయం మాత్రం బట్టబయలైంది.
ఎస్టోనియాలోని ఓ సైంటిస్ట్ 87 ఏళ్ళ వ్యక్తి మెదడుకు ఈఈజీ యంత్రాన్ని అమర్చి పరిశోధన చేశారు. తొలిసారిగా ఈ యంత్రం ద్వారానే మరణిస్తున్న వ్యక్తి ఆలోచనలను రికార్డు చేశారు. ఈ పరిశోధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వచ్చాయి..చనిపోయే కొద్ది గడియల ముందు అతని చిన్న వయస్సు లో జరిగిన వాటి గురించి లేదా బాగా సంతోషాన్ని ఇచ్చిన దాని గురించి గుర్తు చేసుకుంటారు.గుండెపోటు వచ్చి మృతి చెందుతున్నట్లు కనుగొన్నారు. ఈ ప్రయోగంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి శరీరంలోని అవయవాలు ఎంత సేపు పని చేస్తాయి అనేది కూడా మేజర్ చేశారు..నిజంగా పుట్టుక ఎంత గొప్పది..మరణం అంత భయంకర మైనది..