రాహుల్ గాంధీ ఈనెల 7న చంచల్ గూడ జైలుకు వస్తారు: రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ నేతల బలమూరి వెంకట్ తో పాలు 18 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ నెల 7న వీరిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వస్తారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరామని తెలిపారు. జైలు అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనలో మా నేతలు వీసీని కలిశారని… కేసీఆర్ ఒత్తడి వల్ల రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. NSUI విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ పర్యటన ఉంటుందని విసి ని విజ్ఞప్తి చేశారు.. అక్కడికి వెళ్లిన మా విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారని ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత ఈరోజు ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news