Kamal Haasan: కమల్ హాసన్ ‘విక్రమ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన సినిమా చూడటానికి అభిమానులే కాదు సాధారణ సినీ ప్రేక్షకులూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. వెండితెరపైన కమల్ హాసన్ పోషించే పాత్రలు, నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అంచనాలను మించిన పర్ఫార్మెన్స్ ఇవ్వడం కమల్ ప్రత్యేకత అని చెప్పొచ్చు కూడా. ఇక యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్- కమల్ హాసన్ కాంబోలో వస్తున్న సినిమా ‘విక్రమ్’పైన మొదటి నుంచి ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

తాజాగా మేకర్స్ ‘విక్రమ్’ ఫిల్మ్ అప్ డేట్ ట్విట్టర్ వేదికగా ఇచ్చారు. పిక్చర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న విక్రమ్ ఆడియో లాంచ్ తో పాటు ట్రైలర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. ఈ మూవీలో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో పాటు మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ (ఫఫ) కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

‘విక్రమ్’ సినిమాలో చాలా డిఫరెంట్ అండ్ అతి పెద్ద గ్రాండ్ స్టోరిని కమల్ హాసన్ చెప్పబోతున్నారని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన రెండు చిత్రాలు ‘ఖైదీ, మాస్టర్’..తెలుగులోనూ విడుదలై సక్సెస్ అయ్యాయి. కాగా ‘విక్రమ్’ పిక్చర్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ 3న సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news