2018లో ప‌బ్‌జి ఓన‌ర్లు ఎంత సంపాదించారో తెలిస్తే.. క‌ళ్లు తేలేస్తారు..!

-

కేవ‌లం 2018లోనే ప‌బ్‌జి కార్ప్‌.. ఏకంగా 920 మిలియ‌న్ డాల‌ర్ల‌ (సుమారుగా రూ.6,362 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఏంటీ ఆశ్చ‌ర్యంగా ఉందా..? అయినా మేం చెబుతున్న‌ది నిజ‌మే.

ప‌బ్‌జి మొబైల్‌.. ప్లేయ‌ర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్‌.. ఏ పేరుతో పిలిచినా స‌రే.. ఇప్పుడీ గేమ్ యువ‌త‌కు కిక్కెక్కిస్తోంది. ప‌బ్‌జి మ‌త్తులో యువ‌త‌, చిన్నారులు మునిగి తేలుతున్నారు. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకీ ప‌బ్‌జి ఆడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ప‌బ్‌జి గేమ్ ఆడేవారి సంఖ్య పెరుగుతున్న‌ట్టుగానే ఆ గేమ్ డెవ‌ల‌ప‌ర్ కంపెనీ ప‌బ్‌జి కార్పొరేష‌న్‌కు కూడా ఏటా వ‌స్తున్న ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే కేవ‌లం 2018లోనే ప‌బ్‌జి కార్ప్‌.. ఏకంగా 920 మిలియ‌న్ డాల‌ర్ల‌ (సుమారుగా రూ.6,362 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది.

ఏంటీ ఆశ్చ‌ర్యంగా ఉందా..? అయినా మేం చెబుతున్న‌ది నిజ‌మే. ఇక కేవ‌లం 2018లోనే ప‌బ్‌జి కార్ప్‌కు ప‌బ్‌జి మొబైల్ వ‌ల్ల వ‌చ్చిన లాభం ఏకంగా 310 మిలియ‌న్ డాల‌ర్లు (దాదాపుగా రూ.2,143 కోట్లు). అవును, మ‌న దేశంలో ప‌బ్‌జి మొబైల్ ప్లేయ‌ర్ల వ‌ల్లే ఇంత భారీగా ప‌బ్‌జి కార్ప్ లాభాల‌ను ఆర్జించింద‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా ప‌బ్‌జి మొబైల్ గేమ్ క‌న్నా.. పీసీ వెర్ష‌న్ ద్వారానే ఆ కంపెనీకి లాభాలు ఎక్కువ‌గా వ‌చ్చాయ‌ట‌.

నిజానికి ప‌బ్‌జి గేమ్ మొబైల్ వెర్ష‌న్ క‌న్నా.. పీసీ వెర్ష‌నే ముందుగా వ‌చ్చింది. అందుక‌నే ఆ కంపెనీకి పీసీ వెర్ష‌న్ ద్వారానే లాభాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఇక ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు 790 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపుగా రూ.5,463 కోట్లు) ఆదాయాన్ని ప‌బ్‌జి కార్ప్ పొందింద‌ట‌. ఇక మొబైల్ వెర్ష‌న్ ద్వారా ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు 60 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపుగా రూ.414 కోట్లు) ఆదాయాన్ని ప‌బ్‌జి కార్ప్ ఆర్జించింద‌ట‌. ఏది ఏమైనా.. ఈ లెక్క‌లను చూస్తుంటే చాలు.. మ‌న‌కు ప‌బ్‌జి గేమ్ ఎంత పాపుల‌ర్ అయిందో ఇట్టే తెలిసిపోతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news