బంగ్లాల‌పై కూర‌గాయ‌ల‌ను పెంచుతున్నారు.. టెర్రేస్ వ్య‌వ‌సాయంతో అనేక లాభాలు..!

-

క‌రోనా నేప‌థ్యంలో గ‌తంలో ప్ర‌జ‌ల‌కు కూర‌గాయ‌లు తెచ్చుకునేందుకు బ‌య‌ట‌కు వెళ్ల‌డం చాలా క‌ష్టంగా మారింది. దీంతో చాలా మంది ఇండ్ల‌లోనే సొంతంగా కూర‌గాయ‌ల‌ను పెంచ‌డం మొద‌లు పెట్టారు. ఇక స్థ‌లం లేని వారు బంగ్లాల మీద‌, బాల్క‌నీల్లో పెంచుతున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో హైడ్రోపోనిక్స్ అనే వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తి ఆక‌ర్ష‌ణీయంగా మారింది. దీంతో ఈ విధానంలో చాలా మంది కూర‌గాయ‌ల‌ను పెంచుతూ అనేక లాభాల‌ను పొందుతున్నారు.

Raising vegetables on bungalows .. Many benefits with terrace farming ..!

సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే కూర‌గాయ‌ల‌ను మ‌ట్టిలో పెంచుతారు. అయితే హైడ్రోపోనిక్స్ విధానంలో కేవ‌లం నీటి ద్వారానే కూర‌గాయ‌ల సాగు జ‌రుగుతుంది. మొత్తం 100 శాతంలో 90 శాతం నీటి ద్వారా, 10 శాతం మ‌ట్టి ద్వారా కూర‌గాయ‌ల‌ను పెంచుతారు. దీంతో సాధారణం క‌న్నా ఎక్కువ మొత్తంలో కూర‌గాయ‌లు చేతికి వ‌స్తాయి. అలాగే ఈ విధానానికి చాలా త‌క్కువ స్థ‌లం అవ‌స‌రం అవుతుంది. కేవ‌లం నీరు స‌రిగ్గా అందుతుందా లేదా వంటి అంశాల‌ను త‌నిఖీ చేసుకుంటే చాలు. హైడ్రోపోనిక్స్ ద్వారా ఎవ‌రైనా స‌రే కూర‌గాయ‌ల‌ను సుల‌భంగా పెంచ‌వ‌చ్చు.

ఇక గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్ర‌స్తుతం అనేక మంది త‌మ ఇండ్ల టెర్రేస్‌ల‌పై కూర‌గాయ‌ల‌ను పెంచుతున్నారు. దీంతో త‌మ త‌మ ఇండ్ల‌లోకి స‌రిపోయే కూర‌గాయ‌లు పోను మిగిలిన వాటిని ఇత‌రుల‌కు విక్ర‌యిస్తూ లాభాలు గ‌డిస్తున్నారు. ప్ర‌స్తుతం చాలా మంది హైడ్రోపోనిక్స్ విధానం ద్వారా కూర‌గాయ‌ల‌ను పండిస్తున్నారు. దీని వ‌ల్ల ఫ్రిజ్‌ల‌లో కూర‌గాయ‌ల‌ను నిల్వ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు కూర‌గాయ‌ల‌ను తెంపి ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో తాజా అయిన‌, సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పండిన కూర‌గాయ‌ల‌ను తిన‌వ‌చ్చు. ఈ క్రమంలో అనారోగ్య స‌మస్య‌లు రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news