మీ ఇంట్లో వైఫై స్లో అయ్యిందా..? ఈ వస్తువులే అందుకు కారణం..!

-

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ పై ఆధారపడిపోయారు. చాలామంది ఇళ్లల్లో ఆఫీసుల్లో వైఫై ని పెట్టించుకుంటున్నారు. వైఫై ఉండడం వలన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా.. మనకి పనులు టైం కి అయిపోతాయి. ఎంత పెద్ద ఫైల్స్ అయినా, వీడియోస్ అయినా ఏ ఆటంకం లేకుండా డౌన్లోడ్ అయిపోతాయి. అయితే వైఫై స్పీడ్ తగ్గింది అంటే ఇంట్లో ఉండే వస్తువులు కారణమవ్వచు అని తెలుస్తోంది. వైఫై సరిగ్గా రాకుండా స్పీడ్ తగ్గిపోయినట్లయితే ఇంట్లో మైక్రోవేవ్స్ వలన ఇలా జరగొచ్చు.

మైక్రోవేవ్స్ ఇంట్లో ఉండడం వలన వైఫై నెట్వర్క్ స్లో అయిపోతుందట. అలాగే బేబీ మానిటర్స్ ఉంటే కూడా వైఫై స్పీడ్ తగ్గుతుందని తెలుస్తోంది. బేబీ మోనిటర్లు వైఫై నెట్వర్క్ ని నెమ్మదిస్తాయి. అలాగే కొన్ని స్మార్ట్ డివైస్లు వంటి వాటి వలన వైఫై నెట్వర్క్ సరిగ్గా రాదట. పక్క ఇంట్లో వాళ్ళ వైఫై వలన కూడా ఒక్కోసారి మన వైఫై నెమ్మదిస్తుంది.

స్ట్రీమింగ్ డివైస్లు, వైర్లెస్ సెక్యూరిటీ కెమెరాలు వలన కూడా వైఫై స్లో అయిపోతుంది. స్మార్ట్ టీవీలు, స్ట్రీమింగ్ స్టిక్స్ వంటివి కూడా వైఫై ని స్లో చేసేస్తాయి. ముఖ్యంగా పాత కార్డ్ లెస్ ఫోన్స్ వంటి వాటి వలన స్పీడ్ బాగా తగ్గిపోతుందట. మైక్రోవేవ్స్ కి 2.4 GHz ఫ్రీక్వెన్సీ ని వైఫై రూటర్లు షేర్ చేయడం వలన ఓవర్ ల్యాప్ అయ్యి వైఫై స్పీడ్ తగ్గుతుంది. అలాగే బేబీ మానిటర్లకి కూడా ఇలాగె ఓవర్ ల్యాప్ అయ్యి స్పీడ్ తగ్గుతుంది. ఇలా ఇంట్లో ఈ వస్తువులు ఉంటే కచ్చితంగా ఇంట్లో ఉండే వైఫై పై ప్రభావం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news