ఇలాంటి కేక్ నెవ్వర్ బిఫొర్..ఎవ్వర్ ఆప్టర్..

-

కేకులు అంటే ఇష్టపడని వాళ్ళు..స్వీట్,క్రీమ్,చూడగానే ఆకర్షించేలా డిజైన్ ఇవన్ని కూడా భోజన ప్రియులను ముగ్దులను చేస్తాయి.అందుకే వయస్సు తో సంబంధం లేకుండా అందరు తింటారు.అయితే జనాలను ఆకర్షించడానికి బెకరీ వాళ్ళు కొత్త కొత్త డిజైన్, ఫ్లెవర్స్ తో పాటు హంగులను తీసుకు వస్తున్నారు.దాంతో డిమాండ్ పెరిగింది..కాగా,తాజాగా ఓ కేకు డిజైన్ నెట్టింట వైరల్ అవుతుంది. కింద కేకు..పైన ఒక పెద్ద రెజ్యుమ్ ను రాసినట్లు ఉంది..

చాలామంది మంచి ఉద్యోగాలు సాధించేందుకు తమ రెజ్యూమ్లను సరికొత్తగా తయారు చేస్తుంటారు.ఈ నేపథ్యంలో ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. తనకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టింది. ప్రస్తుతం అది కాస్తా నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని నార్త్ కరోలీనాకు చెందిన కార్లీ పావ్లినాక్ బ్లాక్బర్న్ అనే మహిళ తన రెజ్యూమ్ను సరికొత్తగా తయారు చేసింది. ప్రముఖ కంపెనీ ‘నైక్’లో ఉద్యోగం సాధించేందుకు వినూత్నంగా తన రెజ్యూమ్ను కేక్పై ప్రింట్ చేయించింది. అనంతరం ఆ కేక్ను ‘నైక్’ సంస్థకు పంపించింది. తాను ఎందుకు కేక్పై ప్రింట్ చేసిన రెజ్యూమ్ను ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ‘నైక్’ సంస్థకు పంపించిందో.. ఆమె లింక్దిన్ పోస్ట్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

నైక్ సంస్థ భారీ వేడుకను జరుపుకుంది. లేబ్రోన్ జేమ్స్, కొలిన్ కేపెర్నిక్, ఇతర ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. అలాంటి పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని..తన తాను వినూత్నంగా నైక్ సంస్థకు తెలియజేయాలనుకున్నానని.. అందుకే ఇలా చేశానని కార్లీ చెప్పుకొచ్చింది.ఆమె ఆలోచన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను మెచ్చుకోగా.. మరికొందరు విమర్శించారు. ఒక నెటిజన్ ఆమెది ఇంటరెస్టింగ్ యాక్ట్ అంటూ కామెంట్ చేయగా,కేకు సెల్ పెంచడానికి జిమ్మిక్కు అని కొందరు అంటున్నారు.. మొత్తానికి ఇది నెట్టింట చక్కర్లు కోడుతుంది…

Read more RELATED
Recommended to you

Latest news