పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. అవును, శృంగారంలో తమకున్న ఫీలింగ్సే అవతలి వారికి ఉన్నాయా లేవా అన్నది పట్టించుకోరు. అందుకే శృంగార జీవితాన్ని సరిగ్గా ఆనందించకుండా ఉండిపోతారు.

చాలామటుకు మగాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ ఆలస్యం చేసే మగాళ్ళు వాళ్ళ కోరికలను, శృంగారం పట్ల వారి ఆలోచనలు తెలియకుండానే పక్కమీదకి వాలిపోతారు. అందుకే ప్రస్తుతం మహిళల్లో శృంగార కాంక్షను రెచ్చగొట్టడానికి మగాళ్ళు తెలుసుకోవాల్సిన చిట్కాలను తెలుసుకుందాం.

కౌగిలింత

ఏదో ఒక పుస్తకంలో ఒక మాట ఉంటుంది.. ముద్దు ముత్యపు సేరు.. కౌగిలి కాసుల పేరు అని. అది నిజంగా నిజమే. శృంగారంలో కౌగిలింతకి నిజంగా అంత ప్రాధాన్యం ఉంటుంది. మీ బాహువుల్లో అల్లుకున్నప్పుడు కలిగే భద్రతని మహిళలు ఎక్కువగా కోరుకుంటారని సెక్స్ థెరపిస్టులు చెబుతున్నారు. శృంగారం ముందే కాదు, తర్వాత కూడా కౌగిలించుకోవాలని అనుకుంటారని సమాచారం.

బెటర్ ఫోర్ ఫ్లే

శృంగారంలో కీలక ఘట్టానికి చేరుకునే ముందు ఫోర్ ప్లేని ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి విషయాలు వారు బహిర్గతం చేయకపోవచ్చు. కానీ మంచి ఫోర్ ప్లే మంచి శృంగార అనుభవానికి నాంది అని చెప్పవచ్చు.

తొందర వద్దు

చాలామంది మగాళ్ళు చేసే తప్పు ఇదే. తొందర తొందరగా కానివ్వాలని చూస్తారు. కానీ అది సరైన పని కాదు. ముద్దు కౌగిలింతలతో మొదలై ఫోర్ ప్లేతో శిఖరాగ్ర స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు.