ఎవరీ రూప్సా చౌదరి.. నెటిజన్లు ఈమె గురించి ఎందుకు ఎక్కవగా వెతికారు?

-

తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఇప్పుడు సరైన వేదిక. సరైన టాలెంట్ ఉండాలే గానీ.. క్షణాల్లో స్టార్ అయిపోవచ్చు. అలా ఓవర్ నైట్ లో స్టార్లు అయినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందులో ఒకరే రూప్సా సహా చౌదరీ.

Rupsa Chowdhury became national crush of India in 2018

ఈమె పేరు ఎప్పుడన్నా విన్నారా? సోషల్ మీడియా, యూట్యూబ్ పరిచయం ఉన్నవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. అంతే కాదు.. 2018 లో నెటిజన్లు ఎక్కువగా ఈమె గురించే వెతికారట. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో నెటిజన్లు ఈమె గురించి చాలా వెతికారట. గత ఏడాది జూన్ లో రెడ్ హార్ట్ ఎంటర్ టైన్ మెంట్ అనే యూట్యూబ్ చానెల్ లో రూప్సాకు సంబంధించిన ఓ ఫోటోషూట్ అప్ లోడ్ అయింది. అంతే.. నెటిజన్లు ఆమె ఫోటోషూట్ కు ఫిదా అయిపోయారు. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమె ఫోటోషూట్ లతో చాలా వీడియోలను రిలీజ్ చేశారు.

Rupsa Chowdhury became national crush of India in 2018

నిజానికి రూప్సా ఒక మోడల్. సినిమా హీరోయిన్ కాదు. పశ్చిమ బెంగాల్ ఆమె ఊరు. ఆమె వయసు 24 ఏళ్లు. చాలా ప్రకటనల్లో ఆమె నటించింది. ముఖ్యంగా శారీస్ కు మోడల్ గా నటిస్తుంది. షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ సాంగ్స్, ఫోటోషూట్లు, ప్రకటనల్లో రూప్సీ నటిస్తుంటుంది. ఈమెను బెంగాలీ యువత ముద్దుగా బాంగ్ క్రష్ అని పిలుస్తారట.

Rupsa Chowdhury became national crush of India in 2018

ఈమె హీరోయినా లేక ఇంకేంటి… అంటూ నెటిజన్లు ఆమె గురించి నెట్ లో తెగ వెతికేస్తున్నారట. అందుకే 2018 లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీలలో రూప్సా కూడా నిలిచింది. మరి.. రూప్సా హాట్ ఫోటోషూట్లను చూస్తారా?

Read more RELATED
Recommended to you

Latest news