స్కూళ్ళకి వెళ్ళడానికి పిల్లలు ఎగ్జైటింగ్ గా ఉన్నారు.. ఎందుకంటే..?

-

సాధారణంగా స్కూలు స్టార్ట్ అయ్యిందంటే చాలు ఎప్పుడు సెలవులొస్తాయా అని చూస్తారు విద్యార్థులు. ఎప్పుడు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళిపోదామా.. ఎప్పుడు సండే వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ కరోనా టైమ్ లో పాఠశాలలకి సెలవులచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది. వేసవి వస్తుందనగా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయకుండా స్కూళ్ళకి సెలవులు వచ్చేసాయి. ఆ తర్వాత రెండు నెలలు లాక్డౌన్.. అన్ లాక్ మొదలయినప్పటి నుండి అన్నీ తెరుచుకుంటున్నాయి గానీ పాఠశాలలు తెరుచుకోలేదు.

విద్యార్థుల మీద రిస్క్ తీసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముంటుంది. అందుకే వారికోసం ఆన్ లైన్ క్లాసులని తీసుకొచ్చారు. టీవీల్లో పాఠాలు చెప్పారు. ఐతే ప్రస్తుతం కొన్ని రాష్ట్రం పాఠశాలలు తెరవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వారిపై విమర్శలు చేస్తున్నప్పటికీ, విద్యార్థుల్లో చాలామంది స్కూలుకి వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

దానికి కారణం లాక్డౌన్.. లాక్డౌన్ వల్ల పిల్లలకి ఎక్కడికి వెళ్ళకుండా అయిపోయింది. చిన్నపిల్లలపై కరోనా ఉదృతి మరింత ఎక్కువగా ఉంటుందన్న కారణంగా తల్లిదండ్రులు వారిని ఇంట్లోనే ఉంచాల్సి వచ్చింది. కనీసం పక్కింటి వారితో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అన్న ఉద్దేశ్యంతో వారి చేతులు బంధించినట్టు అయ్యింది. పట్టణాల్లో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉండింది. ఈ కారణంగా స్కూళ్ళు తెరుచుకోబోతున్నాయన్న వార్త విద్యార్థుల్లో ఉత్సాహం కలిగించింది.

పాఠశాలలో తమ స్నేహితులు, ఉపాధ్యాయులతో మాటలు, సాయంత్రం పూట ఆటలు, మధ్యాహ్నం పూట లంచు బాక్సులు.. అరుపులు, కేకలు, గోలలు అన్నీ మళ్ళీ తిరిగొస్తాయన్న కారణంగా విద్యార్థుల్లో స్కూళ్ళకి వెళ్ళడానికి ఉత్సాహం పెరిగింది.

ఐతే ఏది ఏమైనా పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. పైన చెప్పినవన్నీ కరోనా టైమ్ లో విద్యార్థులకి దొరక్కపోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉండి ఉండి వాళ్లలో పెరిగిపోతున్న ఒకలాంటి నిర్లిప్తత దూరం అయ్యే అవకాశం ఉంది. ఐతే పాఠశాలలు తెరవాలని నిర్ణయం తీసుకుంటున్న రాష్ట్రాలు కరోనా విస్తరించకుండా, విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news