కూల్ డ్రింక్స్‌కు బానిస‌య్యాడు.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?

-

సాధార‌ణంగా ఇంటికి ఎవ‌రైనా అతిథులు వ‌స్తే కూల్‌డ్రింక్స్ ఇచ్చేస్తుంటాం. ఇక‌ స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే చాలు బాటిల్స్ మీద బాటిల్స్ డ్రింక్స్ తాగేస్తుంటాం. కూల్ డ్రింక్స్ చాలా డేంజ‌ర‌స్ అని తెలిసిన‌ప్ప‌టికీ ఎవ‌రూ కూడా వాటిని వ‌దిలిపెట్ట‌రు. అయితే కూల్ డ్రింక్స్‌ మద్యం కంటే ప్రమాదకరమని తెలిపేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఓ యువ‌కుడు నిత్యం కూల్ డ్రింకులు తాగే వాడు. ఈ క్ర‌మంలోనే డ్రింకులకు బానిసై ఆహారం తినడం మానేశాడు.


చివ‌ర‌కు అతడి కుడి చేయి ఊడిపడియేంతగా కుళ్లిపోయింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మలేషియా రాజధాని కౌలలాంపూర్‌లో మహ్మద్ రజీన్ అనే వ్యక్తి కూల్ డ్రింక్ కనపడితే చాలు వదిలిపెట్టేవాడే కాదు. ఆహారం కంటే ఎక్కువగా డ్రింకులను మాత్రమే తాగుతూ కూర్చునేవాడు. దీంతో అతడి కుడి భుజం వద్ద బాగా నొప్పి మొద‌లైంది. మ‌హ్మ‌ద్‌ వైద్యుడిని సంప్ర‌దించ‌గా అతడికి డయబెటీస్ ఉన్నట్లు నిర్ధరించారు. అయిన‌ప్ప‌టికీ కూడా అత‌డు డ్రింక్స్ తాగ‌డం మాన‌లేదు.

ఇక వాడిలో షుగ‌ర్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అత‌డి కుడి భుజం దాదాపు కుళ్లిపోయి ఊడిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ క్ర‌మంలోనే హాస్ప‌ట‌ల్‌లో చేరిన మ‌హ్మ‌ద్‌కు వైద్య ప‌రీక్ష‌లు చేసి చర్మం, ఎముక కింది భాగం బాగా పాడైపోయిందని చెప్పారు. మ‌రియు ఇలాగే వ‌దిలేస్తే చేయి శరీరం నుంచి వేరయ్యేదని తెలిపారు. ఇక అత‌డి చేయికి చికిత్స చేసి తీపి తినొద్ద‌ని అత‌డికి హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version