నిజాయితీగా ఉంటే అంతే… 27 ఏళ్ల స‌ర్వీసులో ఆయ‌న‌కు 52 సార్లు ట్రాన్స్‌ఫ‌ర్లు..!

-

అశోక్ త‌న సర్వీస్‌లో ఐఏఎస్ ఆఫీస‌ర్ గా ఎన్నో కుంభ కోణాల‌ను బ‌య‌ట పెట్టారు. 2012లో రాబర్ట్ వాద్రాకు కేసులో ఆయ‌న చూపిన తెగువ‌కు ఆయ‌న పేరు అప్ప‌ట్లో దేశ‌మంతా మారుమోగింది.

మ‌న దేశంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు నీతి, నిజాయితీల‌తో ప‌నిచేస్తే.. వారికి ఎలాంటి గౌర‌వం ద‌క్కుతుందో అంద‌రికీ తెలుసు క‌దా. లొంగితే ఓకే. లేదంటే ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తారు. లేదా చంపేస్తారు. అందుకే నిజాయితీగా ఉండాలనుకునే చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు భ‌య‌ప‌డి అవినీతి ప‌రుల‌కు కొమ్ము కాస్తారు. అయితే.. ఎలాంటి బెదిరింపులకు భ‌య‌ప‌డ‌కుండా అత్యంత నిజాయితీతో పనిచేసే వారు కూడా కొంద‌రు ఉంటారు. వారు త‌మ‌ను ఎన్నిసార్లు, ఎక్క‌డికి ట్రాన్స్‌ఫ‌ర్ చేసినా స‌రే.. నిజాయితీగానే ఉంటారు. బాధ్య‌త‌గా ప‌నిచేస్తారు. కోల్‌క‌తాకు చెందిన అశోక్ ఖెమ్కా అనే ఐఏఎస్ అధికారి కూడా సరిగ్గా ఇదే కోవ‌కు చెందుతారు.

అశోక్ 1991 హర్యానా క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారి. ఆయ‌న విధుల్లో చేరిన‌ప్ప‌టి నుంచి అవినీతి ప‌రుల భ‌ర‌తం ప‌డుతూనే ఉన్నారు. నిజాయితీగా ప‌నిచేస్తూ ఇప్ప‌టికి 27 ఏళ్ల స‌ర్వీసును పూర్తి చేసుకున్నారు. అయితే ఇన్ని సంవత్స‌రాల ఆయ‌న స‌ర్వీస్‌లో ఆయ‌న ఎక్కడా ఎవ‌రికీ త‌ల వంచ లేదు. ఎవ‌రి బెదిరింపులకూ భ‌య‌ప‌డ‌లేదు. నిజాయితీగా సేవ‌ల‌ను అందించారు. అందుకే ఆయ‌న్ను చాలా సార్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

అశోక్ త‌న సర్వీస్‌లో ఐఏఎస్ ఆఫీస‌ర్ గా ఎన్నో కుంభ కోణాల‌ను బ‌య‌ట పెట్టారు. 2012లో రాబర్ట్ వాద్రాకు కేసులో ఆయ‌న చూపిన తెగువ‌కు ఆయ‌న పేరు అప్ప‌ట్లో దేశ‌మంతా మారుమోగింది. అయితే ఆ కేసు చూస్తున్న ఆయ‌న‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఏడాది కింద‌టే అశోక్ హ‌ర్యానా క్రీడ‌ల శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియామ‌కం అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న్ను తాజాగా సైన్స్ అండ్ టెక్నాల‌జీ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బ‌దిలీ చేశారు. ఈ క్ర‌మంలో అశోక్ త‌న 27 ఏళ్ల స‌ర్వీసులో ఇప్ప‌టికి 52 సార్లు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. అయినా ఆయ‌న ఏ శాఖ‌లో ప‌నిచేసినా ఎవ‌రికీ భ‌య‌ప‌డలేదు. ఈ క్ర‌మంలో అశోక్‌ను ఏ ఒక్క శాఖ‌లోనూ 6 నెల‌ల‌కు మించి ప‌నిచేయ‌నివ్వ‌లేదు. అయితే తాజాగా అశోక్‌తోపాటు మ‌రో 8 మంది ఐఏఎస్ అధికారుల‌ను హ‌ర్యానా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news