ఇంట్లో ఈ సంకేతాలు.. రాబోయే ఆర్థిక ఇబ్బందులకు సూచనలు

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించాడు. ముఖ్యంగా ఆర్థిక విషయాలపై ముఖ్యమైన సమాచారాన్ని అందించాడు. మన జీవితంలోకి రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని పసిగట్టడానికి కొన్ని సూచనలు చేశాడు. చాణక్య నీతి ప్రకారం ఆర్థిక సంక్షోభం రావడాన్ని సూచించే కొన్ని సంకేతాలు ..

ఇంట్లో తులసి మొక్క పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తే శుభసూచికంగా భావిస్తాం. అలాగే తులసి ఎండిపోవడం డబ్బు కొరతకు చిహ్నం. భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులకు సంకేతం కూడా కావచ్చు. తులసి ఎండిపోవడం మొదలు పెడితే.. రాబోయే కాలంలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం.

ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఇంట్లో గొడవలు చెడుకు సంకేతం. గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి నివాసముండదట. ఇది ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపిస్తుంది.

ఏ ఇంట్లో అయితే శుభ్రతకు ప్రాధాన్యత ఉండి.. పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పూజలు చేయని ఇంట్లో లక్ష్మీ నిలవదట. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే పూజలు చేయడం తప్పనిసరి అని చాణక్య నీతిలో ప్రస్తావించారు.

ఇంట్లో అద్దం పగిలితే అశుభంగా భావిస్తాం. పదేపదే గాజువస్తువులు పగిలిపోతే ఆ ఇంటిని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని అర్థం. గాజు పగలడం ఆర్థిక ఇబ్బందులను సూచిస్తోందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు.