వరల్డ్ రికార్డు దిశలో సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం..!

-

విమాన ప్రయాణం అంటేనే అదో అనుభూతి. కొత్త అనుభూతి. ఆ అనుభూతిని ఇంకాస్త పెంచే ప్రయత్నం చేస్తోంది సింగపూర్ కు చెందిన ఓ విమానం. దాదాపు 16700 కిలోమీటర్ల మారథాన్ ప్రయాణాన్ని పూర్తి చేసి వరల్డ్ రికార్డు సృష్టించే పనిలో పడింది సింగపూర్ విమానం. సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకు దాదాపు 19 గంటల పాటు ప్రయాణిస్తోంది. కంటిన్యూస్ గా 19 గంటలు ప్రయాణించి.. 161 మంది ప్రయాణికులకు మాంచి కిక్ ను అందించనుంది. గురువారం రాత్రి 9 గంటలకు ఆ విమానం టేకాఫ్ తీసుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు న్యూయార్క్ కు చేరుకుంటుంది. ఇక.. ఏకధాటిగా 19 గంటల పాటు ఆ విమానం ఎక్కడా ల్యాండ్ అవకుండా గాల్లోనే ప్రయాణించనుంది. దీంతో విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా… వాళ్లకు బోర్ కొట్టకుండా.. రకరకాల ఈవెంట్ల ప్లాన్ చేసిందట ఎయిర్ లైన్స్ సంస్థ. వావ్.. ప్రయాణానికి ప్రయాణం.. ఎంజాయ్ మెంట్ కు ఎంజాయ్ మెంట్.. బాగుంది కదా.

Read more RELATED
Recommended to you

Latest news