తలుపులు ఉన్నవైపు కాళ్లుపెట్టి నిద్రపోకూడదని ఎందుకంటారు?..అసలు ఏ దిశలో పడుకుంటే మంచిది..?

-

నిద్రసుకమెరగదు..ఆకలి రుచి ఎరగదు అంటారు. బాగా ఆకలేసినప్పుడు ఏది దొరికితే అది తింటాం..దాని రుచి, వాసన మనకు అప్పుడు అనవసరం. అలానే నిద్రకూడా అంతే..బాగా అలసిపోయినప్పుడో లేదా నిద్రొచ్చినప్పుడు మనం ఎక్కడ వెసులుబాటు ఉన్నా ఓ కునుకేస్తుంటాం. ఇలా చేసే చాలాసార్లు క్లాస్లో టీచర్స్ ముందు, ఆఫీస్లో బాస్ దగ్గర దొరికిపోయిన సందర్భాలు కూడా ఉండే ఉంటాయ్ కదా. అయితే పడుకోవటానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయట. మంచినిద్ర మంచిఆరోగ్యానికి సూచిక. మంచినిద్రే మనకు అవసరమైన ఎనర్జీని ఇస్తుంది. అయితే మనం నిద్రపోయే స్థితికూడా చాలాముఖ్యం అని మనపెద్దవాళ్లు చెబుతుంటారు.
తూర్పు, పడమర దిక్కుల్లో పడుకోవడం మంచిదని చెప్తుంటారు. మన ఇళ్లల్లో కూడా బెడ్ ఈ దిక్కుల్లోనే సెట్ చేసుకుంటారం… ఉత్తర దిక్కు వైపు పడుకోకూడదని అంటారు. అయితే.. తలుపులు ఉన్న వైపుకు కూడా కాళ్ళు పెట్టి నిద్రించకూడదట. తలుపులు వున్నా వైపుకు తల వచ్చేలా ఉంచి నిద్రించాలట. పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఒక బలమైన కారణమే ఉండి ఉంటుంది.
ఉత్తర దిశలో నిద్రపోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ దిక్కులో తలపెట్టి నిద్రపోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా పెరుగుతుందట. మనస్సు కూడా నియంత్రణలో ఉండదు. ఉత్తరంతో పాటు దక్షిణ దిశలోనూ తల పెట్టి పడుకోకూడదు. ఎందుకంటే ఈ దిశలో శవాలనే పడుకోబెడతారు. ఇది యమలోకాన్ని సూచిస్తుంది. కాబట్టి మనం ఒకవేళ పొరపాటున అలా పడుకున్నా మన ఇంట్లోవాళ్లు లేపేస్తుంటారు.
కాళ్ళు తలుపులు ఉన్న వైపుకు పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ మన వైపుకు వచ్చే అవకాశం ఉంటుందట. అలా చేయడం వలన ప్రశాంతమైన నిద్ర పట్టదట. ఉదయం లేచిన తరువాత కూడా అలసట ఉంటుంది. ఎవరైనా చనిపోయినపుడు వారి కాళ్ళని తలుపులువైపుకు ఉంచి బయటకు తీసుకు వెళ్తారు. అందుకే.. కాళ్ళు తలుపులవైపుకు ఉంచి నిద్రించకూడదని.. అలా చేయడం వలన దెయ్యాలను ఆహ్వానించినట్లు అవుతుందని పెద్దలు చెబుతుంటారు. అంతేందుకు తలుపున ఉన్న వైపు కాళ్లు పెట్టామంటే..మన ముఖం మీద లైటింగ్ ఎక్కువగా పడుతుంది. సరిగ్గా నిద్రపట్టదు.

ఏ దిశలో పడుకోవాలి:

వాస్తుశాస్త్రం ప్రకారం తలను తూర్పు దిశలో ఉంచడం ద్వారా బంగారం దక్కే అవకాశముంటుందట. ఈ దిశలో నిద్రించడం ద్వారా బాగా నిద్రపోతారు. అంతేకాకుండా మీకు శక్తిమంతమైన అనుభూతి కలుగుతుంది. తూర్పు దిశ కుబేరుడి దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో తలపెట్టి నిద్రించడం ద్వారా కుబేరుడు అనుగ్రహం పొందుతారని చెబుతుంటారు.
పెద్దలు ఏమి చెప్పినా దానికి ఓ కారణం ఉంటుంది. గుమ్మం గుండా నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. అందుకే మనకు కొన్ని పద్ధతులును అలవరిచారు. సో ఇప్పుడు రోజు మీరు ఏ దిశలో పడుకుంటున్నారో ఓ సారి చెక్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news