అప్పుల పాలైపోతున్న యువత… కారణం అవే…!

-

ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్ లేకుండా కనపడటం లేదు… అనకూడదు గాని వంటి మీద బట్టలు లేని వాడు అయినా కనపడుతున్నాడు గాని చేతిలో ఫోన్ లేని వాడు మాత్రం కనపడటం లేదు. తల్లి తండ్రులు కాస్త రిచ్ అయితే ఖరీదు అయిన ఫోన్ లతో పిల్లలు కనపడుతున్నారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు దానికి బానిసలు గా మారిపోయి అలవాటు పడుతున్నారు… ఇక ఆ గేమ్స్ ఈ గేమ్స్ అంటూ సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. వచ్చిన ప్రతీ కొత్త మోడల్ ని కొనుగోలు చెయ్యాలని భావిస్తున్నారు.

అది మంచిది కాదు అంటున్నారు నిపుణులు… వాళ్ళు ఫోన్ ఎక్కువ వాడుతున్నారని కాదు వాళ్ళ భవిష్యత్తుకి అది శ్రేయస్కరం కాదు… ఆర్ధిక జీవనాన్ని దెబ్బ తీస్తుంది అంటున్నారు. చిన్నప్పటి నుంచి వాటికి అలవాటు పడిన పిల్లలు మార్కెట్ లో ఏదైనా కొత్త ఫోన్ వస్తే చాలు కొనుగోలు చెయ్యాలని కంగారు పడిపోతున్నారు. ఇందుకోసం అప్పులు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే చాలా మంది యువత… క్రెడిట్ కార్డులతో వచ్చిన ప్రతీ కొత్త మోడల్ కొనుగోలు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రులు వాటికి అలవాటు చేయడం,

ఆ తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కాలేజి దశలోనే అప్పులు చేసి కొత్త మొబైల్స్ కొనుగోలు చేయడానికి అప్పులు చేయడం చేస్తుంది యువత… ఇప్పుడు మార్కెట్ లో యువతను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటి కోసం యువత ఇళ్ళల్లో వస్తువులను కూడా అమ్మేసే వరకు వెళ్ళారు. ఇక తల్లి తండ్రులు కొనుగోలు చేసి ఇచ్చిన వాహనాలు కూడా తాకట్టు పెట్టి ఫోన్ లు కొనుగోలు చేస్తున్నారు. ఇదే క్రమంలో విలాసాలకు అలవాటు పడటానికి అప్పులు చేయడం, బయట పది రూపాయల వడ్డీకి తీసుకుంటున్నారు. దీని కారణంగా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. దీనికి అలవాటు పడిన వారి ఆర్ధిక జీవనం భవిష్యత్తులో ఇబ్బందికరమే.

Read more RELATED
Recommended to you

Latest news