పాత 500, 1000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి అవకాశం ఇంకా వుందా…? ఇందులో నిజమెంత..?

కరోనా వైరస్ మహమ్మారి అందర్నీ పట్టిపీడిస్తోంది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు విశేషాలు స్మార్ట్ ఫోన్ లో మనం చూస్తున్నాం. అవి కనుక నిజమైతే ఏ మాత్రము బాధ ఉండదు అదే ఒకవేళ అవి తప్పు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. తప్పు విషయాలు కనుక వచ్చాయి అంటే అది ప్రభుత్వానికి కూడా కష్టమైపోతుంది. పైగా వాటిని మళ్లీ యధావిధిగా తీసుకెళ్లడం కూడా కష్టమైన పనే. అయితే ఇప్పటికే డిమానిటైజేషన్ అయిపోయి నాలుగేళ్లయింది.

కానీ సోషల్ మీడియా లో ఇప్పుడు కొత్తగా ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. పాత 500 మరియు 1000 నోట్లను మార్చుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ అయిందని విపరీతంగా వైరల్ అవుతోంది. రూపాయిలు 500 నోట్లు మరియు వెయ్యి రూపాయల నోట్లు మార్చుకోవడానికి సమయాన్ని పొడిగించారన్న వార్తలు వస్తున్నాయి.

గతం లో అయితే ఈ ఫెసిలిటీ కేవలం ఫారెన్ టూరిస్ట్ లకు మాత్రమే అని ఆర్బీఐ చెప్పింది. దీని కోసం లెటర్ హెడ్ ఫార్మెట్లో ఆర్బిఐ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఆ లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రభుత్వం మరొక సారి ఈ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చిందంటూ చెబుతున్నారు.

డిమానిటైజేషన్ 2016 లో జరిగింది. అప్పుడు డేట్ ఎక్స్టెన్షన్ చేసి ఈ ఫెసిలిటీ ని కల్పించారు. నవంబర్ 2016 లో పాత నోట్లు ఇచ్చేయాలని, ఆ తర్వాత కొత్త 500 నోట్లని ప్రవేశపెట్టారు. వెయ్యి రూపాయల్ని నిలిపివేశారు.

2016 నవంబర్ 8 న రాత్రి ఎనిమిది గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ గురించి భారతీయ ప్రజలని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అయితే పాత 500 నోట్లు మరియు వెయ్యి నోట్లు నిలిపివేస్తున్నట్లు ఆనాడు మోడీ చెప్పారు. ఆ తర్వాత కూడా చాలా సార్లు ఈ నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఆ డెడ్ లైన్ ఎప్పుడో అయిపోయింది.