తాజ్ మహల్ చుట్టూ రాత్రిపూట ఒక చిన్న లైట్ కూడా ఎందుకు పెట్టలేదో తెలుసా..పెట్టినప్పుడ ఓ సారి ఏం జరిగిందంటే..! 

ప్రేమకు నిలువెత్తు నిదర్శనం తాజ్ మహల్. ప్రపంచదేశాలనుంచి ఎంతో మంది పర్యటకులు ఈరోజుకి వస్తుంటారు. తాజ్ మహల్ తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇండియా మొదట గుర్తుకువచ్చేది తాజ్ మహలే.. నిత్యం తాజ్ మహల్ దగ్గర సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మీరు కూడా వెళ్లేఉంటారు కదా..అయితే వెళ్లిన వారికే ఒక ప్రశ్న. మీరెప్పుడై తాజ్ మహల్ చుట్టూ లైట్స్ ఉండటం గమనించారా. రాత్రిపూట తాజ్ మహల్ లో లైట్స్ వెయ్యరూ..అసలు ఉండవు కూడా..దానికి కొన్ని కారణాలు ఉన్నాయట..అవేంటంటే..

తాజ్ మహల్ మార్బుల్ తో తయారు చేశారు. ఇది మనందరికీ తెలుసిన విషయమే.. అయితే చంద్రుడి నుండి వచ్చే లైట్ తాజ్ మహల్ లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. అందుకే తాజ్ మహల్ లో ప్రత్యేకంగా లైట్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు.

లైట్స్ వేయడం వలన పురుగులు వస్తాయి. అవి ఎక్కువగా తిరిగి నేలపై ఏమైనా వేయడం వలన మార్బుల్ నేల రంగు మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తాజ్ మహల్ లో కొన్ని చోట్ల ఇలా పురుగుల వల్ల మార్బుల్ గ్రీన్ కలర్ లో మారింది. ఎంతో తెల్లగా ఉండే ఈ కట్టటం రానురాను కలర్ మారిపోతూ వస్తుంది. ఇంకా ఈ లైట్స్ వల్ల లేనిపోని పురుగుల వచ్చే పాడుచేసే ప్రమాదం లేకపోలేదు.

అంతే కాకుండా రాత్రిపూట లైట్ వేసి ఉంచితే తాజ్ మహల్ కి సందర్శకులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొద్దునపూటే రద్దీగా ఉంటుంది. ఇక లైట్స్ నిత్యకల్యాణం పచ్చతోరణం అనే సామెత టైప్ లో తాజ్ మహల్ దగ్గరు ఎప్పుడూ పర్యటకులు ఉంటారని కూడా లేట్స్ పెట్టలేదట.

కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశ ప్రభుత్వం తాజ్ మహల్ కి లైట్లు ఏర్పాటు చేసింది. కానీ ఏర్పాటు చేసిన రోజు రాత్రి ఆ లైట్లు అన్ని పేలిపోయాయయ.. ఇది ఏమైనా ఎలక్ట్రికల్ సమస్య ఏమో అని యాజమాన్యం కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు.

అయితే రెండవసారి ఎలక్ట్రిసిటీ అంతా క్షణంగా చెక్ చేసి అప్పుడు మళ్ళీ లైట్లు ఏర్పాటు చేశారు. కానీ రెండో సారి కూడా మొదటిసారి జరిగిందే రిపీట్ అయ్యిందట.. ఇలా ఎందుకు అయ్యిందో ఎవరికీ తెలియదు. కొంత మంది మాత్రం ఏవో తెలియని శక్తులు ముంతాజ్ ఆత్మని కాపాడుతున్నాయి అని అంటారు. కానీ ఇది ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియదు.

లైటింగ్ అనేది తాజ్ మహల్ సర్ఫేస్ పై ప్రభావం చూపుతుంది. పర్యావరణంలో ఏర్పడిన పొల్యూషన్ ఇప్పటికే తాజ్ మహల్ పై ఎంతో ప్రభావం చూపింది. కాబట్టి ఇంక వేరే ఏ విధంగా అయినా కూడా సరే తాజ్ మహల్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని యాజమాన్యం భావిస్తోంది.

ఇవండీ కారణాలు..అందుకే తాజ్ మహల్ లో రాత్రి పూట లైట్ లు ఉండవు. ఇంట్రస్టింగ్ కదా. మీ ఆత్మీయులకు షేర్ చేసి ఈ విషయాన్ని పంచుకోండి.!

– Triveni Buskarowthu