ఫొటోగ్రాఫర్‌ను కొట్టిన వరుడు.. పడిపడి నవ్విన వధువు.. ఎందుకంటే..!

Join Our Community
follow manalokam on social media

మెన్ విల్ బి మెన్ అంటుంటారు. ఒక వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరు చూస్తుంటే ఎవరూ ఓర్చుకోలేరు. అలాంటిది చూస్తున్నప్పుడే సైట్ కొడుతుంటే ఎలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. పెళ్లి వేదికపై ఫోటోలు తీసున్న ఓ ఫొటోగ్రాఫర్ వరుడు పక్కన నిల్చున్న పెళ్లికూతురి ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు. వరుడును పక్కకు జరిపి మరీ వధువు ఫోటో తీస్తున్నాడు. అది చూసిన వరుడికి కోపం వచ్చి ఫొటోగ్రాఫర్‌ను కొట్టడంతో వధువు ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

marriage

ఒక బంధం ఏర్పడాలంటే.. పెళ్లి ఎంతో ముఖ్యం. పెళ్లి అనేది జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక. అందుకే పెద్దలు పెళ్లి తంతుకు సంబంధించిన మధుర క్షణాలను చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్‌ను పిలిపించుకుంటారు. కాళ్లకు పసుపు రాసినప్పటి నుంచి పెళ్లి బాజాలు మోగి.. అప్పగింతలు అయ్యే వరకు ఫొటోగ్రాఫర్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఎంతో కష్టపడి పెళ్లి వేడుకను ఫొటోగ్రాఫర్లు వీడియోలు, ఫోటోలు తీస్తుంటారు. వీలైనంత వరకు ఫోటోలు మంచిగా వచ్చేలా వారు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఫోటోలు, వీడియోలు బాగా వచ్చేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. కొందరు ఫొటోగ్రాఫర్లు వధువరులకు రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీస్తుంటారు. ఎంతో ఓపిక, సహనంతో కూర్చుంటూ ఫోటోలు దిగుతుంటారు వధువరులు.

అయితే ఓ పెళ్లి వేదికపై ఫోటోలు తీస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ వరుడిని పక్కకు జరిపి.. వధువు ఫోటోలు తీయడం మొదలు పెడతాడు. వధువు కూడా రకరకాల ఫోజులు పెడుతూ ఫోటోలు దిగుతుంది. అది చూసిన వరుడికి కోపం వచ్చింది. వెంటనే ఫొటోగ్రాఫర్ చెంప చెల్లుమనిపించాడు. వాస్తవానికి ఆ ఘటనకు అక్కడి పరిస్థితి.. గొడవకు దారి తీసేది. కానీ పెళ్లి కూతురు ఇచ్చిన రియాక్షన్‌కి అక్కడ సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. పెళ్లి కొడుకు ఫొటోగ్రాఫర్‌ని కొట్టడంతో వధువు కింద కూర్చొని పడిపడి నవ్వుతుంది. అది చూసి అందరూ నవ్వుతూ ఉండిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

TOP STORIES

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మనందరికి తెలుసు. ఈ మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడానికా? లేదా ఆందోళనలు నిర్వహించడానికా? అసలు దేనికోసం నిర్వహించుకుంటారో తెలుసా? శతాబ్దం కిందట...