గోర్లపై ఉండే అర్థ చంద్రాకారానికి అర్థం తెలుసా?

సాధారణంగా మన చేతి గోర్లపై అర్థ చంద్రాకారం ఉంటుంది. అయితే, దాని అసలు అర్థం ఏంటో మీకు తెలుసా? ఇది అందరి గోళ్లపై ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే దాని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం. మన చేతి వేళ్ల గోర్లు మన జీవితాన్ని నిర్ణయిస్తాయట. అవును! ఇది నిజం. చైనీస్‌ నిపుణుల వల్ల ఈ విషయం తెలిసింది. వారు దీన్ని బాగా నమ్ముతారు.

గోర్లపై భారీ అర్థ చంద్రాకారం ఉంటే, వారికి మెంటల్‌ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందట. వాళ్లు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉంటుంది.  అయితే, ఒకవేళ అన్ని వేళ్ల గోర్లకూ భారీ అర్థ చంద్రాకారం ఉంటే కూడా ప్రమాదమేనట. అంటే పెద్ద అర్థ చంద్రాకారం అన్ని గోర్లకూ ఉంటే మంచి జరగదని అర్థం. అలాంటి వారి హార్ట్‌ బలహీనంగా ఉంటుందట. వారికి గుండె, నరాల సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా మీ గోర్లపై పెద్ద అర్థ చంద్రాకారం ఉంటే వారికి హార్ట్‌ బీట్‌ చాలా వేగంగా ఉంటుంది. ఒకవేళ అన్ని గోర్లకూ చిన్న అర్థ చంద్రాకారం ఉంది అంటే, వారిలో ఇంటెలిజెన్స్‌ పవర్‌ తక్కువగా ఉంటుందని అర్థం. వారిలో శారీరక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. వీక్‌ నెస్‌ వల్ల… జీర్ణక్రియ వ్యవస్థ కూడా సరిగా పనిచెయ్యదు.

ఒకవేళ గోర్ల రంగు ఎరుపు వర్ణంలో ఉంటే, వారు చాలా ఆరోగ్యంగా ఉంటారట. అంతేకాదు, ఏ పని చేసినా విజయం సాధించగలరని చెబుతున్నారు. అదేవిధంగా మీ గోర్లపై ఎలాంటి గతుకులూ లేకుండా స్మూత్‌గా ఉండి, పింక్‌ లేదా ఎరుపు రంగు ఉంటే… వారు చాలా అదృష్టవంతులట. వారికి అంతా మంచే జరుగుతుంది.