ఆకులపై పెయింటిగ్ కామనే..ఈకలపై వేయడమే కదా హైలెట్..!

-

మనలో టాలెంట్ ఉండాలే కానీ..అది ఎలా అయినా ప్రదర్శించుకోవచ్చు. సుద్దముక్కలపై ఎన్నో అద్బుతమైన బొమ్మలు తీర్చిదిద్దిన వారు ఉన్నారు. బొద్దింకలపై పెయింటింగ్స్ వేసిన వాళ్లు ఉన్నారు. ఇక ఆకుల పై ఎన్నో అందమైన చిత్రాలు గీసిన టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు.. తాజాగా ఈకలపై అద్భుమైన చిత్రాలు గీసి ఔరా అనిపిస్తుంది లగ్మి మేనన్.
తన కలను ఏ ఒక్కదానికో పరిమితం చేయకూడదని… కనిపించిన ప్రతిదానిపైనా బొమ్మలు వేయాలనుకుంటుంది. అలా వస్తువుల నుంచి పండ్ల వరకు ప్రతిదానిపైనా ప్రయత్నించింది. కానీ అవన్నీ ఇప్పటివరకూ ఎందరో వేసినవే.. కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఈకలపై చేయాలన్న ఆలోచన వచ్చింది. వీటిమీద పెయింటింగ్‌ ఓ పట్టాన అతుక్కోదు. ఓ సవాలులా తీసుకుని ప్రయత్నించింది. చిన్న చిన్న బొమ్మల నుంచి మనుషుల చిత్రాలవరకూ గీసింది. తర్వాత ఆకులపైనా ఇదే పరిస్థితి. ముడుచుకుపోయి పెయింటింగ్‌ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. దానిపైనా పట్టు సాధించి ఇప్పుడు అవలీలగా వేసేస్తోంది.
నిజానికి లగ్మికి చిత్రకళపై అవగాహన తక్కువే. స్కూలు స్థాయిలో ప్రత్యేక తరగతి ఉన్నా.. స్నేహితుల సాయంతో నెట్టుకొచ్చేసింది. ఈమెది కేరళ. లాక్‌డౌన్‌ సమయంలో కాళీగా ఉండకుండా.. ఏదైనా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఈ కళ తనను ఆకర్షించింది. ఆన్‌లైన్‌ కోర్సు చేసి, బొమ్మలు గీసేది. తనకంటూ ప్రత్యేకత ఉండాలి అనుకుని ఈకలు, ఆకులు, గింజలు.. ఇలా వివిధ రకాల వాటిపై ప్రయత్నిస్తోంది. తను గీసిన వాటిని ‘లచ్చూస్‌ లిటిల్‌ క్రియేషన్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేది. వాటికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కడమే కాదు.. తమకీ చేసివ్వమని కోరడమూ మొదలుపెట్టారు. దీంతో కొంత మొత్తం తీసుకొని చేసించేది.. ఈమె ప్రయత్నాలకి గుర్తింపూ దక్కింది. ఒకే ఈకపై ఆరుగురు స్వాతంత్య్ర సమరయోధులను అరగంటలో గీసి ఇండియా, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ చోటు దక్కించుకుంది. అభిరుచీ, ఆదాయమూ.. ఇంకా గుర్తింపు..ఇంతకు మించి ఇంకే కావాలి..
నేర్చుకోవాలన్న తపన ఉంటే చాలు..ఏదైనా సరే అవలీలగా చేసేగలగవచ్చు. పుట్టుకతోనే ఏదీ ఎవరికీ రాదు.. శ్రద్ధపెట్టి బుర్రకు పదును పెడితే..ఏదైనా మనకు వచ్చేస్తుందని ఈమె మరోసారి నిరూపించింది. ఇంతకీ మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news