దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినది. రాబోయే 48 గంటల్లో అది మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వాయిగుండం ఉత్తర తమిళనాడు వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో మార్చి 04 నుంచి ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అల్పపీడనం కారణంగా ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో వర్షాలు పడతాయనే అంచనాతో రైతుల్లో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది.