మీ ప్రేమని వెల్లడి చేయడానికి ఇండియాలో రొమాంటిక్ ప్లేసెస్ ఏంటో తెలుసుకోండి..

Join Our Community
follow manalokam on social media

భారతదేశం ఎన్నో సంస్కృతులకి నిలయం. ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు గల ఈ దేశంలో చారిత్రాత్మక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ప్రదేశానికి ఒక్కో విశిష్టత ఉంది. కొన్ని ప్రత్యేక రోజులని ఆ ప్రదేశాల్లో జరుపుకుంటే ఆ కిక్కే వేరు. అలా ఈ ప్రేమికుల రోజుని భారత దేశంలోని ప్రత్యేకమైన ప్రదేశాల్లో జరుపుకుంటే చాలా బాగుంటుంది. మీ ప్రేమని వెల్లడి చేయడానికి అంతకంటే మంచి ప్రదేశాలు లేవనిపించేలా ఉండే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

కోలా బీచ్ గోవా..

సంవత్సరం మొత్తం లాక్డౌన్ తర్వాత మీరు ప్రేమించిన వారిని తీసుకెళ్ళడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఉండదేమో. చుట్టూ పచ్చని చెట్లు, వాటిని దాటి ముందుకెళితే ఎగిసి పడే సముద్రం, ఇసుక తిన్నెల్లో రాత్రిపూట నిశ్శబ్దంగా కూర్చుని అలల చేసే చప్పుడు మాత్రమే వింటూ ఒకరిపై ఒకరి ప్రేమని తెలియజేసుకుంటే ఆ ఆనందమే వేరు.

తాజ్ మహల్.. ఆగ్రా

ప్రేమికుల రోజున తాజ్ మహల్ వంటి ప్రదేశానికి వెళ్ళడం నిజంగా అద్భుతమే. ప్రేమకి చిహ్నంగా చెప్పుకునే అద్భుతమైన పాలరాతి కట్టడం తాజ్ మహల్ చెంతన మీ ప్రేమని వెల్లడి చేస్తే కాదనే వారు ఉండరు.

ఎగసే ఎయిర్ బెలూన్.. ఉదయ్ పూర్

గాల్లో బెలూన్ ఎగురుతూ ఉంటే అందులోంచి మీరు ప్రపంచాన్ని కిందకి చూస్తూ మీ ప్రేమ ఎత్తులో పైకి వెళుతూ మీరు ప్రేమించిన వారికి బహుమతి అందించి, ప్రేమిస్తున్నానని చెప్పండి. ఈ ప్రదేశానికి ప్రేమికుల రోజున తాకిడి చాలా ఎక్కువే.

సెరాయి.. జై సల్మేర్

రాజస్థాన్ లోని ఈ ప్రాంతం అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుంది.

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...