ఈ తేయాకు ధర రూ. లక్ష.. పభోజన్ గోల్డ్ టీకి అంతుందా..!

-

ఛాయ్‌..రోజు లేవగానే చాలామంది దినచర్య చాయ్‌తోనే మొదలవుతుంది. ఈవినింగ్‌ అయితే చాలు..ఛాయ్‌ తాగేవరకూ మనసాగదు. బ్రిటీష్‌ వాళ్లు ఇండియాను వదిలి వెళ్లినా వాళ్లు చేసిన అలవాట్లు మాత్రం ఇంకా మనోళ్లు పాటిస్తూనే ఉన్నారు. ఈ టీ అలవాటు కూడా.. వాళ్ల దగ్గర నుంచే వచ్చింది. టీలలో బోలెడు రకాలు.. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ , మసలా టీ, అల్లం టీ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. టీ పౌడర్‌ ధర మహా అయితే.. వెయ్యి రూపాయలు ఉంటుంది. కానీ ఈ టీ ఆకుల ధర అక్షరాల లక్ష రూపాయలు.

అస్సాంలోని అరుదైన జాతి పభోజన్ గోల్డ్ టీ కిలో లక్ష రూపాయలకు అమ్ముడైంది. జోర్హాట్‌లోని వేలం కేంద్రంలో సోమవారం ఈ తేయాకు విక్రయం జరిగింది. కిలో తేయాకు అక్షరాల రూ. 1 లక్షకు అమ్ముడుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసోంకు చెందిన ‘ఎసాహ్ టీ’ బ్రాండ్ దీనిని రూ. 1 లక్షకు కొనుగోలు చేసినట్టు వేలం కేంద్రం అధికారి స్పష్టం చేశారు. పభోజన్ గోల్డ్ తేయాకు.. ఆర్గానిన్ తేయాకు. అత్యంత అరుదైన రకం. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో దీన్ని మొదటిసారి ఒక కిలో మాత్రమే పండించారు.
ఈ ఖరీదైన టీ ఆకును పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ విక్రయించిందని.. అస్సాంకు చెందిన టీ బ్రాండ్ ‘ఎసాహ్ టీ’ కొనుగోలు చేసిందని చెప్పారు. అస్సాంలోని అత్యుత్తమ టీ రకాల్లో ఇదొకటి అని జోర్హాట్ టీ వేలం కేంద్రం (JTAC) అధికారి ఎస్సా టీ సీఈఓ బిజిత్ శర్మ తెలిపారు.
ఈ తేయాకుని కోసిన తర్వాత సహజసిద్ధంగానే బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఈ టీ పొడితో తయారయ్యే టీ.. పసుపు రంగులో ప్రశాశవంతంగా ఉంటుంది. ఇది టీకి మంచి రుచిని కూడా అందిస్తుంది. ఇది చాలా అరుదైన టీ కాబట్టి.. ఒక్క కప్పు టీ తాగడం వల్ల ప్రజలకు చాలా ప్రత్యేకమైన, విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇంత ఖరీదైనది కాబట్టి.. నిజంగానే చాలా రుచిగా ఉండొచ్చు. సామాన్య వ్యక్తి తన జీవితంలో ఈ టీ ఒక్కసారైనా తాగలేడమో కదా..!

Read more RELATED
Recommended to you

Latest news