ప్రేమికుల మధ్య బంధం ఆరోగ్యంగా ఉందని తెలిపే సంకేతాలు..

Join Our Community
follow manalokam on social media

ప్రేమికుల రోజు ఎంతో దగ్గరలో ఉంది. తాము ప్రేమించే వారికి ఆ విషయాన్ని తెలపడానికి ఎంతో సమయం లేదు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచమంతా ప్రేమమయంతో నిండిపోతుంది. ఐతే మీ ప్రేమని అవతలి వారికి చెప్పారు. ఆ తర్వాతేంటి? వాళ్ళు ఒప్పుకుంటే రిలేషన్ షిప్ లోకి అడుగుపెడతారు. కాదంటే అక్కడితో ఆపేస్తారు. కాదనడం గురించి పక్కన పెడితే, రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టేవారు కొన్ని విషయాలని తెలుసుకోవాలి. బయట నుండి ఆ వ్యక్తిని చూస్తూ ప్రేమించడం వేరు. అదే వ్యక్తితో నిరంతరం ఉంటూ ప్రేమించడం వేరు.

మొదటి దానికి ఆకర్షణ ఉంటే సరిపోతుంది. కానీ రెండవ దానికి అంతకు మించి కావాలి. ప్రేమించేటపుడు రాని సమస్యలన్నీ రిలేషన్ లోకి వెళ్ళాకే వస్తాయి. అందుకే ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బంధం ఆరోగ్యంగా ఉందా లేదా అని మీకు సందేహాలు వస్తున్నాయా? ఐతే మీ బంధంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి.

సద్విమర్శ

తప్పు చేయని వారు ఎవరూ ఉండరు. మీరు తప్పు చేసినపుడు దాన్ని విమర్శించకుండా అందులో ఉన్న లోపాలని మీరు తెలుసుకునేలా చెయ్యగలగడం.

మద్దతు

మీ భాగస్వామికి నచ్చని పని చేస్తున్నా దానికి మద్దతు పలకడం. మీకిష్టమైన పని అవతలి వారు చేయకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం.

స్వేఛ్ఛ:

మీరిద్దరూ కలిసి జీవితాన్ని లీడ్ చేస్తుండచ్చు. కానీ ఎవరి స్పేస్ వారికి ఉంటుంది. అలాంటి స్పేస్ మీకుందా? మీ భాగస్వామి మీకు అలాంటి స్పేస్ కల్పిస్తున్నాడా?

సౌకర్యం:

మీ భాగస్వామితో మీరున్నప్పుడు సౌకర్యంగా ఫీలవుతున్నారా? లేదా అనవసరమైన ఆందోలనకి గురవుతున్నారా?

భావ వ్యక్తీకరణ

మీకొచ్చిన ఏ ఆలోచనైనా మీ భాగస్వామితో చెప్పాలని మీకు కుతూహలంగా ఉందా? అలా నిపిస్తే మీ రిలేషన్ షిప్ బాగున్నట్టే.

పై లక్షణాలు మీ ఇద్దరిలో ఉంటే మీ బంధం ఆరోగ్యంగా ఉందని అర్థం చేసుకోవాలి.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...