వైరల్ అవుతున్న ఐపీఎస్ ఆఫీసర్ వెయిట్ లాస్ జర్నీ..

-

అధిక బరువు ఎవ్వరికీ నచ్చదు. సన్నగా ఉన్నవారు తమని విమర్శిస్తారని కొందరు, సన్నగా ఉన్నవారిని చూస్తూ తామెందుకలా లేమని మరికొందరు బాధపడుతూ ఉంటారు. లాక్డౌన్ కారణంగా బరువు పెరగడం సాధారణం అయిపోయింది. అందుకే అందరూ తమ బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి ముఖ్యంగా కావాల్సింది మోటివేషన్. నేను బరువు తగ్గగలను అన్న నమ్మకం. ఆ నమ్మకం మీకు కావాలంటే ఈ ఐపీఎస్ ఆపీసర్ వెయిట్ లాస్ జర్నీ తెలుసుకోవాల్సిందే.

ఐపీఎస్ వివేక్ రాజ్ సింగ్ కుక్రేల్ వెయిట్ లాస్ జర్నీ ఇప్పుడు వైరల్ గా మారింది. 138కిలోల బరువు నుండి 43కేజీల బరువు తగ్గి సన్నగా మారి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. తన వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడిన ఆఫీసర్ ఇలా అన్నారు. ఐపీఎస్ శిక్షణలో ఉన్నప్పుడు 134కిలోల బరువు ఉండేవాడిని, 46వారాల ఐపీఎస్ శిక్షణ 104కిలోలకి చేర్చింది. కానీ ఆ తర్వాత ఆ బరువును స్థిరంగా ఉంచుకోలేకపోయాను. బేసిగ్గా నాకు ఆహారం అంటే ఇష్టం. ఆహారం వృధా కాకూడదన్న ఉద్దేశ్యంతో ఎక్కువగా తినేవాడిని. కొన్ని సార్లు కడుపు నిండినా కూడా తినేవాడిని.

ఆ అలవాటు నన్ను 138కిలోలకి చేర్చింది. అప్పుడు బరువు తగ్గడంలో ఆహారమే కీలకం అని గుర్తించాను. అందుకే సరైన డైట్ పాటించాను. అలా కొన్ని రోజులు పాటిస్తూ ఉంటే, బరువు తగ్గడం తెలిసివచ్చింది. సరైన సమయానికి తినడం, అతిగా తినకపోవడం, ఇంకా అదీగాక స్టెప్ సెట్ గో అనే యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఎంత నడిచానని చూసుకోవడం వల్ల బరువు తగ్గడం విషయంలో ఒక పద్దతి అలవాటైందని చెప్పుకొచ్చారు. అలా తన ఆహార అలవాట్లతో 43కిలోల బరువు తగ్గి సన్నగా మారానని మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news