తిమింగలం వాంతి విలువ కోట్లల్లో.. మన దేశంలో మాత్రం అమ్మితే జైల్లో..!

-

కొన్ని విషయాలు మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మనం అస్సలు పనికిరావు అనుకున్నవి వేరే దగ్గర లక్షలు పోసి కొంటారు..ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో అతి భారీ జంతువు తిమింగలం. సముద్రం మధ్యలో లోతైన ప్రాంతాల్లోనే ఇది జీవిస్తుంది. ఒడ్డుకు రావడం చాలా కష్టం. తిమింగలాల్లో ఒక రకం ‘స్పెర్మ్ వేల్’. ఇది అప్పుడప్పుడు ఆహారాన్ని తిన్నాక వాంతి చేసుకుంటుంది. ఆ వాంతిని అంబర్ గ్రిస్ అని పిలుస్తారు. దాని కోసం ఎంతోమంది స్మగ్లర్లు రెడీగా ఉంటారట. ఆ వాంతి విలువ కోట్లల్లో ఉంటుంది.. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని కోట్లు గడిస్తున్న వ్యాపారులు ఉన్నారు.

తిమింగలం శరీరంలో అంబర్‌ గ్రీన్‌ను ఎందుకు ఉత్పత్తి అవుతుందో మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కచ్చితంగా కారణాన్ని కనిపెట్టలేకపోయారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం.. తిమింగలంలోని జీర్ణవాహిక ఆ చేప తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసేందుకు ఈ అంబర్ గ్రిస్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నాయి. అది ఎంతవరకు నిజమో చెప్పలేం.. ఆహారం తిన్నాక ఈ అంబర్ గ్రిస్‌ను తిమింగలాలు బయటికి ఉమ్మేస్తాయి. అది సముద్రంపై తేలియాడుతూ ఉంటుంది. వీటి కోసమే ఎంతో మంది స్మగ్లర్లు సముద్రంలో నిత్యం తిరుగుతు ఉంటారు. అందుకే దీన్ని నీటిపై తెలియాడే బంగారం అంటారు..

అసలు ఎందుకు అంత కాస్ట్..

ఈ తిమింగలం వాంతి కిలో కొనాలంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. బంగారం కంటే ఇది ఎంతో విలువైనది. చక్కటి పరిమళాన్ని వెదజల్లుతుంది.
ఈ వాంతిని ప్రఖ్యాత సెంట్ల తయారీలో వాడతారు. అలాగే కొన్ని రకాల ఔషధాలలో కూడా ఈ వాంతిని వినియోగిస్తారు. జీర్ణశక్తికి, నరాల సంబంధం రుగ్మతలకు ఆయుర్వేదంలో కూడా ఈ అంబర్ గ్రిస్ ను వాడతారు. అందుకే ఈ వాంతి చాలా ఖరీదు.

మనదేశంలో మాత్రం చట్టవిరుద్ధం

చాలా దేశాల్లో దీన్ని అమ్ముతారు.. కానీ మన దేశంలో ఈ పదార్థాన్ని అమ్మడం చట్ట విరుద్ధం. ఎందుకంటే స్పెర్మ్ వేల్ అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. 1970లోనే దీన్ని అంతరించిపోతున్న జాతిగా మన దేశం ప్రకటించింది. కేవలం ఈ వాంతి కోసం ఎంతోమంది వాటిని వేటాడుతున్నారు. అందుకే ఆ పదార్థాన్ని నిషేధించింది. అయితే యూరోపియన్ యూనియన్‌లోని దేశాల్లో దీన్ని అమ్మడం చట్టబద్ధమైనది. అక్కడ eBay సైట్లలో కూడా దీన్ని అమ్ముతున్నారు. ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా దీన్ని నిషేధించారు. మాల్దీవులు, బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో మాత్రం చట్టబద్ధంగా అమ్ముతారు.

Read more RELATED
Recommended to you

Latest news