యూట్యూబ్‌ చూసి అక్కడ సర్జరీ చేసుకున్న యువకుడు..చివరికి..

ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్‌ ను చూస్తూ ఎన్నో కొత్త ప్రయోగాలను చేశారు.అందులో కొన్ని ప్రయోగాలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తే మరి కొన్ని మాత్రం కోపాన్ని తెప్పిస్తున్నాయి. అందులో ఎక్కువగా శరీరం పై చేస్తున్న ప్రయోగాలు..కాస్త వివరాల్లోకి వెళితే..చాలా మందికి అందం పై పిచ్చి పెరిగిపోతుంది. ఏదైనా బాగాలేదని అనిపిస్తే వెంటనే సర్జరీ చేయించుకోవాలని అనుకుంటారు.

 

చాలా మంది సర్జరీ కోసం విదేశాలకు కూడా వెళ్తుంటారు. సర్జరీ అనేది భోజనం వండడం లాంటి పని కాదు. అందుకు శిక్షణ పొందిన వైద్యులు మాత్రమే అవసరం. బ్రెజిల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ చూసి తానే స్వయంగా సర్జరీ చేసుకున్నాడు. చివరకు హాస్పిటల్ పాలయ్యాడు..

బ్రెజిల్‌లోని సావో పాలోకు చెందిన ఒక వ్యక్తి యూట్యూబ్ వీడియోను చూసి తన ముక్కుకు శస్త్రచికిత్స చేసకున్నాడు. ముక్కు సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్ లో ట్యుటోరియల్ చూసిన తర్వాత తన స్వంత ముక్కు ఆపరేషన్ (రైనోప్లాస్టీ) చేసుకున్నాడు. అయితే దాని తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో జూలై 21 ఆ వ్యక్తి పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్లాడు. అతని ముక్కును పరిశీలించిన వైద్యులు అతని గాయం మానలేదని,శుభ్రం చేయవలసి ఉందని తెలుసుకున్నారు.

యూట్యూబ్ వీడియో తనను ముక్కు శస్త్రచికిత్స గురించి ఆలోచించేలా చేసిందని, అందులో ముక్కును విస్తరించడానికి ట్రిక్ చెప్పబడిందని,దీంతో తానే ఆపరేషన్ చేసుకున్నాను అని ఆ వ్యక్తి స్వయంగా డాక్టర్ల ముందు అంగీకరించాడు.

తర్వాత వైద్యులు అతని గాయాన్ని శుభ్రం చేసి వైద్య విధానం ప్రకారం శస్త్రచికిత్స చేశారు. యూట్యూబ్ చూసి ఎవరూ అలా చేయవద్దని,అలా చేస్తేఎవరికైనా ప్రాణాపాయం తప్పదని హెచ్చరించారు.ఇలాంటివి అస్సలు చెయ్యకూడద..గోటితో పొయ్యే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకోవడం చెయ్యకండి..చేశారో మీ ప్రాణాలకే ముప్పు రావొచ్చు..