కాన్ఫిడెంట్ గా కనిపించడానికి కావాల్సిన టిప్స్… మీకోసమే.

-

ఇంటర్వ్యూల్లో కాన్ఫిడెంట్ గా కనబడితే మంచి మార్కులు పడతాయి. ఇంటర్వ్యూల్లో నువ్వెలా మాట్లాడావన్న దానికంటే కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పావా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఐతే ప్రతీ ఒక్కరికీ ఇంటర్వ్యూని క్రాక్ చేసేంత కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. ఇంటర్వ్యూలు కొత్తగా వెళ్ళేవారికి కొంచెం బెరుకు ఎలానూ ఉంటుంది. ఆ టైమ్ లో కాన్ఫిడెన్స్ కనబడకపోవచ్చు. అందుకోసమే కాన్ఫిడెంట్ గా నటించడమైనా నేర్చుకోవాలి. ఎప్పటి నుండో మనలో లేని క్వాలిటీ ఇప్పుడే వచ్చేయమంటే రాదు. అలా వచ్చిందనుకో అది మంచిదే. కాని రాని వారు మాత్రం కుంగిపోవద్దు. ఎందుకంటే కాన్ఫిడెంట్ గా కనిపించడం ఎలానో తెలుసుకుంటే ఆ గండం నుండి బయటపడవచ్చు.

ఎక్కువ మాట్లాడకండి. మాట్లాడితేనే కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కాదు. తొందర తొందరలో మాట్లాడాలని ప్రయత్నించి తప్పులు మాట్లాడే అవకాశం ఉంది. అందుకే మీ టర్న్ వచ్చేదాకా సైలెంట్ గా ఉండండి. మీ టర్న్ వచ్చాక ఇక విజృంభించండి. అందులో తప్పులున్నా సరే మీరు చెప్పాలనుకున్న విషయం మాత్రం చెప్పేయండి.

మాట్లాడేటపుడు ఎదుటివారి కళ్ళలోకి చూసి మాట్లాడండి. అలాగే పక్కనున్న వారిని కూడా చూడండి. కళ్ళలోకి చూసి మాట్లాడ్డానికి భయపడవద్దు. వారు కూడా మీలాగే జాబ్ వెతుకునేటపుడు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు జాబ్ లో సెటిల్ అయ్యారు కాబట్టి అలా కనిపిస్తున్నారు. మొదట్లో ఎవరైనా అంతే. అందుకే మీరు భయపడవద్దు.

సంభాషణ జరుగుతున్నప్పుడు మీకు నవ్వు వస్తే నవ్వేసేయండి. అలా అని అవతలి వారి డ్రెస్సింగ్ చూసి, వారి ప్రవర్తన చూసి నవ్వకండి. సంభాషణలో వచ్చే కామెడీకి నవ్వండి.

పొరపాటున ఏదైనా తప్పు చేసారనుకోండి. వెంటనే సారీ చెప్పేయండి. తప్పులు అందరూ చేస్తారు. కానీ సారీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. మీ పొరపాటుని ఒప్పుకోవడమే చాలా

Read more RELATED
Recommended to you

Latest news