guinness record : ఇత‌నివి చేతులా లేక ఇనుప రాడ్లా.. ఇలా ప‌గ‌ల‌గొడుతున్నాడేంటి..?

-

మ‌న‌కు నిజంగా ఒక చేత్తో ఒక చిన్న ప్లాస్టిక్ డ‌బ్బాల‌ను ప‌గ‌ల‌గొట్టాలంటేనే ఎంతో నొప్పి లేస్తుంది క‌దా. కానీ కొంద‌రైతే ఒంటి చేత్తోనే ఏకంగా పెద్ద పెద్ద వ‌స్తువుల‌ను ఇట్టే ప‌గ‌ల‌గొడుతారు. ఇక వారి స‌త్తా చూస్తుంటే మ‌న‌కు కూడా చాలా ముచ్చ‌టేస్తుంది క‌దా. ఇక ఇలాంటి వింత ఘ‌ట‌న‌ల‌కు ప్లాట్ ఫామ్ అయిన సోస‌ల్ మీడియాలో ఇలాంటివి నిత్యం మ‌న‌కు ఆనందాన్ని పంచుతూనే ఉంటాయి. ఇక ఇప్ప‌డు కూడా ఇలాంటిదే ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారుతోంది. guinness record

guinness record
guinness record

నిజానికి బాడీ ఎంతుంది అనే దానికంటే కూడా అందులో బ‌ల‌మెంతుంది అన్న‌దే చూడాల‌ని ఇందుకే చెప్తారు కావ‌చ్చు. కొంద‌రు లావుగా ఉంటేనే బ‌ల‌ముంటుందేమో అని అనికుంటారు. కానీ చేతుల్లో స‌త్తా ఉన్న వారే నిజంగా బ‌ల‌వంతులు అని తెలుసుకోలేక పోతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఐర‌న్ చేతులున్న వ్య‌క్తి గురించి మీకు చెప్ప‌బోయేది.

ఓ వ్యక్తి త‌న కుడిచేతుతో ఏకంగా కూల్ డ్రింక్ బాటిళ్ల‌ను కోడి గుడ్ల‌ను ప‌గ‌ల‌గొట్టిన‌ట్టే ప‌గ‌ల‌గొడుతున్నాడు. కేరళకు చెందిన కేఆర్ జాన్ పాల్ అనే ఉక్కు చేతులు క‌లిగిన వ్య‌క్తి ఏకంగా త‌న చేతులో ఒక కోడిగుడ్డును ప‌ట్టుకుని అది ప‌గ‌ల‌కుండా ఏకంగా 30 సెకన్లలో 52 కూల్ డ్రింక్ డబ్బాలను ఇట్టే బద్దలు కొట్టి వ‌ర‌ల్డ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేశాడు. ఇక ఆయ‌న వీడియోను చూసిన వారంతా వావ్ అంటూ మెసేజ్ పెడుతున్నారు. మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news