పెద్దిరెడ్డి నాకు మంచి మిత్రుడు..టిడిపిలో కలిసి పనిచేశారు : కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ సమక్షంలో…. బిజెపి మాజీ నేత పెద్దిరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కండువా కప్పి… పెద్ది రెడ్డి ని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ..   మాజీ మంత్రి పెద్దిరెడ్డి తనకు మంచి మిత్రుడు అని.. తెలుగుదేశం పార్టీ లో కలిసి పని చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పెద్దిరెడ్డి చాలా సీనియర్ నాయకుడు అని తెలిపారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm-kcr

తెలంగాణ ప్రగతి ప్రస్థానం లో పెద్దిరెడ్డి చేదోడు వాదోడు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కేసీఆర్. చేనేత కార్మికులకు బీమా సదుపాయం కలిపిస్తామని.. బీమా సదుపాయం చేయాలని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు…తప్పులేదన్నారు. ఇది చేయడానికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు సిఎం కెసిఆర్. చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలో సదుపాయం కలిపిస్తామన్నారు. తెలంగాణ తరహాలో అమలు అవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలలో లేవని పేర్కొన్నారు. సాధించుకున్న తర్వాత కూడా ”నేనే సిపాయి నేనే సిపాయి” అని కొందరు అంటున్నారని.. ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని స్పష్టం చేశారు సిఎం కెసిఆర్.