ఈరోజుల్లో చదువుకు తగ్గ జాబ్ ఎవరూ చేయడం లేదు. చదువుకునే రోజుల్లో మన ముందు ఉన్నవాళ్లు ఏ కాలేజ్‌లో జాయిన్ అయితే మనల్ని కూడా అందులోనే జాయిన్ చేసి అదే కోర్సు ఇప్పించేవాళ్లు. తీరా చదువు పూర్తి చేశాక చదివి ఫీల్డ్‌లో జాబ్స్ లేక ఏదో ఒకటి వెతుక్కోని చేసేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. శాలరీ ఎక్కువగా వచ్చే జాబ్స్ అంటే అందరూ ఫస్ట్ సాఫ్ట్ వేర్ అనే అంటారు. కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగం కుదేలైంది. ఉన్నవాళ్లకే శాలరీలు ఇవ్వలేక ఇంటికి పంపిస్తున్నారు. ఫ్రషర్స్‌ని తీసుకోవడం లేదు. సరే ఈ విషయం పక్కనపెడితే మన దేశంలో శాలరీ ఎక్కువగా ఇచ్చే ఉద్యోగాలు ఏంటో తెలుసా..? కెరీర్ యూటర్న్ పాయింట్‌లో ఉంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.!
డేటా సైంటిస్ట్
డేటా సైంటిస్ట్ జాబ్ చేసే వారిలో ఏడాదికి రూ. 4 లక్షల శాలరీ ప్యాకేజ్ నుంచి రూ. 12 లక్షల శాలరీ డ్రా చేయడం సర్వసాధారణం. సర్టిఫైడ్ కోర్స్ చేసి, కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నట్టయితే.. వారికి సంవత్సరానికి రూ. 60 లక్షల నుంచి 70 లక్షల వరకు వస్తుంది.
మెడికల్ ప్రొఫెషనల్స్ ( డాక్టర్స్ , సర్జన్స్ )
వైద్య రంగంలో అత్యంత ఎక్కువ శాలరీ ప్యాకేజెస్ డాక్టర్స్, సర్జన్స్‌కే ఉన్నాయి. వీళ్లకు సంవత్సరానికి కనీసం 12 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వారికి ఉన్న డిమాండ్, పని తీరు, సక్సెస్ రేటును బట్టి వారి శాలరీ ఇంకా ఎక్కువే ఉంటుంది.
మెషిన్ లెర్నింగ్ ఎక్స్‌పర్ట్స్
మెషిన్ లెర్నింగ్ పని తెలిసిన వారికి ఆరంభంలోనే రూ. 5 లక్షలు నుంచి రూ. 7 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న నిపుణులకు ఏడాదికి రూ. 20 లక్షలు కూడా ఉంటుంది.
కమెర్షియల్ పైలట్
విమానయాన రంగంలో ఆరంభంలోనే పైలట్ శాలరీ రూ. 15 లక్షలతో మొదలవుతుంది. అది వారికి అనుభవం వచ్చే కొద్దీ.. ఫ్లైట్ కేప్టేన్స్ ఏడాది వేతనం 48 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల వరకు పెరుగుతుంది.
ప్రోడక్ట్ మేనేజర్
బిజినెస్ డవప్ అవ్వాలంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ మేనేజర్ స్కిల్స్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ అవసరాలు గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా తమ ప్రోడక్ట్స్‌ని డిజైన్ చేసే వారే ఈ ప్రోడక్ట్ మేనేజర్స్. వీరికి ఏడాదికి రూ. 15 లక్షల నుంచి 26 లక్షల రూపాయల వరకు శాలరీ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు శాలరీలు మాత్రమే ఎక్కువ కాదు.. ఇవి నేర్చుకోవడానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. పెట్టుబడి పెట్టందే లాభం ఎట్లా వస్తుంది మరీ..! ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు వీటి గురించి ఇంకా డీప్‌గా తెలుసుకుని స్టెప్ తీసుకోవచ్చు.