ఏపీ ప్రజల్లో సైలెంట్ రివల్యూషన్ ఉందన్నారు టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. జగన్ ను ఇంటికి పంపాలనే కసి అన్ని వర్గాల ప్రజల్లో ఉందన్నారు. గత 4 ఏళ్లలో ఏపీలో అభివృద్ది లేదని.. పేదల సంక్షేమానికి ఎడాపెడా కోతలుే పెట్టారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ స్కీములు 83 % రద్దు చేశారని అన్నారు. బీసీల స్కీములు 27, ఎస్సీ 29, ఎస్టీ 17, మైనార్టీ 10 రద్దుచేశారని ఆరోపించారు. టీడీపీపై అక్కసుతోనే పేదల స్కీముల రద్దు చేశారని అన్నారు.
ఇచ్చింది గోరంత, ప్రచారం కొండంత అంటూ దుయ్యబట్టారు. నాలుగేళ్లలో ప్రజాధనం పెద్ద ఎత్తున స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు, వైసిపి ఎమ్మెల్యేల మధ్య అవినీతి రేసు నడుస్తోందన్నారు యనమల. పోటీపడి జనం సొమ్ము మింగేస్తున్నారని అన్నారు. ప్రతి మంత్రిత్వశాఖలోనూ అవినీతి కుంభకోణాలేనన్నారు. దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే జగన్ డీపీటీ అంటూ ఎద్దేవా చేశారు. జగన్ అహమే ఆయన పాలనని అంతం చేస్తుందన్నారు.