అప్సరసల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే..!!

-

అందం అంటే ఆడవాళ్ళు..ఆడవాళ్ళు అంటే అందం అన్న సంగతి అందరికి తెలిసిందే.. పూర్వ కాలం నుంచి ఇప్పటివరకు ఆమె స్థానం ప్రత్యేకంగా ఉంది. యుగ యుగాల నుండీ సౌందర్యానికి ప్రతీకగా స్త్రీని వర్ణిస్తూ వచ్చారు కవులూ, రచయితలూ. స్త్రీ నయనాలను చేపలతో, పళ్లను దానిమ్మ గింజల తో, పెదవుల ను విల్లుతో పోల్చడం సర్వ సాధారణం. అయితే, ప్రకృతి, స్త్రీ అందానికి నిదర్శనాలు..

అయితే, స్త్రీ అందాన్ని ఆరాధించే విధానాలలో కాలక్రమేణా ఎన్ని మార్పులొచ్చినప్పటికీ ఆరాధన అనేది మాత్రం పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు.. అప్పటికీ, ఇప్పటికీ కూడా ఒకే ఆదరణ ఉంది.. కేవలం హీరోయిన్ అందచందాల తో కనువిందు చేసుకునేందుకే సినిమాలకు వెళ్లేవాళ్లు సైతం వుంటారు. ఇక సినీ రంగంలో ప్రత్యేకించి హీరోయిన్లను ఎంతగానో అభిమానించే ప్రేక్షకులూ వున్నారు.వెండి తెరపైనే కాదు, బుల్లితెర పై కూడా ఎంతో మందిని ఆరాధించేవాళ్ళు ఉన్నారు.

ఒక అమ్మాయి అందంగా వుంటే అప్సరసలా ఉంది అంటారు.రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే నలుగురు మాత్రమే అప్సరసలు అనుకునేవారూ వున్నారు. నిజానికి అప్సరసలు ఎంతమంది అనే విషయం మీకు తెలుసా? అప్సరసలు మొత్తం ముప్పై ఒక్క మంది.. ఇక ఆలస్యం ఎందుకు వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు చుద్దాము..

1) రంభ 2) ఊర్వశి 3) మేనక 4) తిలోత్తమ 5) ఘృతాచి 6) సహజన్య 7) నింలోచ 8) వామన 9) మండోదరి 10) సుభోగ 11) విశ్వాచి 12) విపులానన 13) భద్రాంగి 14) చిత్రసేన 15)   ప్రమోచన 16) ప్రమ్లోద 17) మనోహరి 18) మనో మోహిని 19) రామ 20) చిత్రమధ్య 20) శుభానన 21) సుకేశి 22) నీలకుంతల 23) మన్మదోద్ధపిని 24) అలంబుష 25) మిశ్రకేశి 26) పుంజికస్థల 27) క్రతుస్థల 28) వలాంగి 29) పరావతి 30) మహారూప 31) శశిరేఖ.. వీరంతా అప్సరసలు అని చెప్పాలి.ఇది అప్సరసల గురించి చాలామందికి తెలియని నిజం..

Read more RELATED
Recommended to you

Latest news