సురక్షితమైన లాభాల కోసం కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్.. లాభాలు, వడ్డీ వివరాలు మొదలైన వివరాలివే ..!

-

ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన ఏ రిస్క్ లేకుండా డబ్బులను పొందొచ్చు. పైగా మంచిగా రాబడి వస్తుంది. సురక్షితమైన లాభాల కోసం ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మీకు ఉపయోగ పడతాయి. మరి ఆ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలను చూద్దాం.

money
money

కిసాన్ వికాస్ పత్ర:

ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలు. ఎంతైనా ఇందులో పెట్టచ్చు. మినిమమ్ రూ. 1,000 పెట్టచ్చు. కిసాన్ వికాస్ పత్రపై మీకు రిటర్న్ గ్యారెంటీగా వస్తుంది. 6.9 శాతం వార్షిక వడ్డీని కిసాన్ వికాస్ పత్ర తో పొందొచ్చు.

సుకన్య సమృద్ధి యోజన:

సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ చాలా మందికి ఉపయోగ పడుతోంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. సుకన్య సమృద్ధి యోజన లో డబ్బులు పెడితే 7.6 శాతం వడ్డీ వస్తోంది. మీ ఇంట్లో వుండే చిన్నారుల కోసం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ లో డబ్బులు పెడితే 7.1% వడ్డీ లభిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. రూ. 1.5 లక్షల వరకు వస్తాయి. పీపీఎఫ్‌పై వడ్డీ చాలా ఎక్కువగా వుంది. రిస్క్ కూడా ఉండదు కనుక ఇందులో డబ్బులు పెట్టచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌:

ఈ స్కీమ్ పై ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఏటా 6.8 శాతం వడ్డీని ఈ స్కీమ్ తో పొందొచ్చు. మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. మినిమమ్ ఇందులో వంద పెట్టాలి. మాక్సిమం లిమిట్ ఏమి లేదు. స్కీమ్ మెచ్యూర్ అయిన తర్వాత రూ.1389.49 రాబడిని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌ తో పొందొచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్:

15 లక్షల రూపాయల వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ తో పొందొచ్చు. 60 ఏళ్లు దాటిన వారికి ఎలాంటి నెలవారీ పెన్షన్ కానీ ఇతర మార్గాల ద్వారా డబ్బును పొందడంలో సహాయపడటానికి ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news