ఆసియా కప్-2022లో అంచనాలే లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దుబాయ్ వేదికగా ముగిసిన పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్ లో లంక, పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంకకు ప్రైజ్ మనీ రూపంలో లక్ష 50 వేల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు కోటి 19 లక్షల రూపాయలు) లభించింది.
ఇందుకు సంబంధించిన చెక్ ను బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ శ్రీలంక కెప్టెన్ దసన్ శనకకు అందజేశాడు. ఇక రన్నరప్ గా నిలిచిన పాకిస్తాన్ కు75,000 డాలర్లు (59 లక్షల 66,000) ప్రైజ్ మనీ దక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక ఆల్ రౌండర్ వానిందు హసరంగాకు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఇక కీలకమైన ఫైనల్ లో 71 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపకస కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.