చాణక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలని చెప్తుంది. నిజానికి ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా మనుషులు ఎలా ఉండాలి ఎటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి వంటి ముఖ్యమైన విషయాలను చాలా చెప్పారు. మనిషి జీవితంలో వచ్చే సమస్యలకు స్ఫూర్తినిస్తాయి చాణక్య చెప్పిన విషయాలు. అయితే పాము నుండి కూడా మనం కొన్ని లక్షణాలని నేర్చుకోవచ్చని వాటిని కూడా మన జీవితంలో అనుసరించడం మంచిదని ఆచార్య చాణక్య చెప్పారు.
అయితే మనిషి జీవితం కష్టసుఖాలతో ఎత్తు ఫలాలతో ఉంటుంది. ఏదో ఒక సవాలు మనకు రోజులో ఎదురవుతూనే ఉంటుంది. అటువంటి సమయంలో మనం భయపడకూడదు. పాములాగ పోరాడేందుకు చూసుకోవాలి. ఇలా పోరాటం చేయడానికి పాము స్ఫూర్తి అని ఆచార్య చాణక్య అంటున్నారు. అలానే బలహీనతల్ని బయటకు చెప్పకూడదు.
మాములుగా పాము దగ్గరికి ఎవరు కూడా వెళ్ల.రు దాని లోపల విషం లేదని తెలిసినా ఎవరు పామును చూసి దగ్గరికి వెళ్ళరు అలానే మనిషి కూడా కష్టాలుప్పుడు బయటకి చెప్పుకోకూడదు. బయటకి కనుక కష్ట సమయంలో బలహీనతలను చెబుతూ ఉంటే శత్రువుకి బలం పెరుగుతుంది. ఓడిస్తారు. అదే విధంగా పాములు కొడుతున్నా సరే అది వెనక్కి తిరిగి పోరాడుతూనే ఉంటుంది. అలానే మనిషి కూడా ఆఖరి వరకూ పోరాటం చేయాలి. అలానే బలహీనతని బయట పెట్టుకోకూడదు. ఇలా ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా మనం మంచిగా ఉండడానికి అవుతుంది గెలవడానికి అవుతుంది.