కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.. కొత్త రిజల్యూషన్స్ లో వీటిని చేర్చుకోండి..

-

2020పూర్తవుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. చాలా మంది కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మాత్రమే మారుతుంది. పరిస్థితులు అలాగే ఉంటాయి. ఏదీ మారదని చెబుతుంటారు. ఐతే ఏది మారినా మారకపోయినా డేట్ మారుతుందన్న సందర్భం చాలామందికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మహమ్మారి కారణంగ ప్రపంచమంతా ఉత్సాహం కోల్పోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్న సమయంలో కొత్త సంవత్సరంతో వచ్చే ఉత్సాహం మంచిదేగా!

కరోనా కారణంగా 2020పూర్తిగా భయభ్రాంతులతోనే గడిపారు. 2021లో నైనా అలాంటి ఇబ్బందులు ఉండవన్న ఆశలు కలిగి ఉండటం తప్పేం కాదు. కొత్త సంవత్సరం డేట్ మారుతుందన్న ఉత్సాహంతో కొన్ని కొత్త అలవాట్లు అలవర్చుకోవాలని చూస్తుంటారు. అలా అలవర్చుకోవాలని చూసే అలవాట్లలో ఈ కింద ఇవ్వబడ్డ వాటిని కూడా చేర్చుకోండి.

పుస్తక పఠనం

లాక్డౌన్ కారణంగా చాలామంది పుస్తక పఠనానికి బాగా అలవాటు పడ్డారు. ఆ అలవాటుని అలాగే కొనసాగించండి. ఒకవేళ ఆ అలవాటు లేనివాళ్ళు తమ రిజల్యూషన్స్ లో పుస్తక పఠనాన్ని చేర్చుకోండి.

కొత్త హాబీ

మీరు చాలా రోజుల నుండి టైమ్ ఇవ్వాలి అనుకుంటున్న ఏదో ఒక హాబీ మీద ఈ సంవత్సరం దృష్టి పెట్టండి. ఇప్పుడు కూడా పక్కన పెట్టేస్తే ఇంకెప్పుడు టైమ్ ఇస్తారు.

వ్యాయామం

చాలా మంది పొద్దున లేచి వ్యాయామం చేయాలని ఎప్పటి నుండో అనుకుంటారు. కానీ పొద్దుపొద్దున్న లేవడానికి బద్దకిస్తారు. కనీసం ఈ సంవత్సరం నుండైనా వ్యాయామానికి సమయం కేటాయించండి.

కొత్త ప్రదేశాలు

ప్రతీ ఏడాది ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అనుకున్న ప్రతీసారీ ఏదో అడ్డుపడి మధ్యలోనే ఆగిపోతుంటారు. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మీ మనసులో ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారో అందులో కనీసం రెండు ప్రదేశాలకైనా వెళ్ళండి.

Read more RELATED
Recommended to you

Latest news