రష్యాలోని మాస్కోలో ఉన్న ఆర్ట్ గ్యాలరీలో ఓ దొంగ సింపుల్ గా 70 కోట్ల విలువైన పెయింటింగ్ ను ఎత్తుకెళ్లాడు. రష్యన్ ఆర్టిస్ట్ అర్కిప్ కుయింద్ జీ వేసిన పెయింటింగ్ అది. దాని పేరు ఏఐ పెట్రి. క్రిమియా, 1 మిలియన్ డాలర్ల విలువైన ఆ పెయిటింగ్ ను మాస్కోలోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. ఆర్ట్ గ్యాలరీకి వచ్చిన ఆ దొంగ… అక్కడికి వెళ్లి ఆ పెయింటింగ్ ను దొంగలించి అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో ఆధారంగా ఆ దొంగను వెంటనే పట్టుకున్నారు పోలీసులు. అతడి నుంచి ఆ ఖరీదైన పెయింటింగ్ ను స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దొంగ పెయింటింగ్ ను తీసుకెళ్తుంటే.. అతడు గ్యాలరీ ఉద్యోగి అని పొరబడ్డారు గ్యాలరీ విజిటర్లు. తర్వాత అసలు విషయం తెలుసుకొని షాకయ్యారు. ఆ నిందితుడి నేరం రుజువైతే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
సింపుల్ గా వచ్చాడు.. 70 కోట్ల విలువైన పెయింటింగ్ ను ఎత్తుకెళ్లాడు
By Anil Kumar
-
Previous article
Next article