మణికర్ణికలో అవి కూడా ఉండుంటే..!

-

కంగనా రనౌత్ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో మొదలు పెట్టిన మణికర్ణిక మూవీ మధ్యలో క్రిష్ తప్పుకోగా కంగనానే డైరెక్ట్ చేసింది. సినిమాకు రిలీజ్ ముందు ఏమి మాట్లాడని క్రిష్ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం తను చేసి ఉంటే మణికర్ణిక బంగారంలా ఉండేదని ఇప్పుడు వెండిగా ఉందని అన్నాడు. అయితే మణికర్ణిక సినిమాలో క్రిష్ తర్వాత యాక్టర్ సోనూ సూద్ కూడా తప్పుకున్నాడు.

అతను నటించిన పోర్షన్ సినిమా నుండి కట్ చేశారు. దానికి సంబందించిన వీడియో బయటకు రాగా ఆ సీన్ ఉండుంటే సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యేదని అసలు కంగానా ఎందుకు ఆ సీన్ తీసేసిందని కామెంట్స్ చేస్తున్నారు. సోనూ సూద్ తప్పుకోగా ఆ పాత్రను మహ్మద్ జీషన్ ఆయుద్ తో చేయించారు. మణికర్ణిక టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది. కంగనా మరోసారి బాక్సాఫీస్ పై తన వీర ప్రతాపం చూపించింది.

Read more RELATED
Recommended to you

Latest news