ప్లాస్టిక్ ను నాశనం చేయలేం.. కానీ పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టకుండా రీసైకిల్ చేసి మనకు తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చని నిరూపించారు బాంబూ హౌస్ ఇండియా కంపెనీ ప్రతినిధులు. అవును.. వాళ్లే ప్లాస్టిక్ రీసైకిల్ తో ఇల్లునే నిర్మించారు. హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ షెల్టర్ ను ప్లాస్టిక్ వేస్ట్ తో నిర్మించారు. 1500 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ ఇంటిని నిర్మించారు. 1.5 లక్షల రూపాయల ఖర్చు అయిందట దీన్ని నిర్మించడానికి. ప్లాస్టిక్ ఇళ్లలో నివసించడం సాధ్యమా? అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. వీళ్లు నిర్మించే ప్లాస్టిక్ ఇళ్లు ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, చెదలు పట్టకుండా… పురుగులు తొలచుకుండా.. వేడి నుంచి కూడా రక్షణ కల్పించేలా నిర్మించారు దీన్ని. సాధారణంగా ఇటుకలు, సిమెంట్, ఇసుకతో నిర్మించిన ఇళ్లలో నివసించినట్టుగానే దీంట్లో కూడా హ్యాపీగా ఉండొచ్చట. బాగుంది కదా ఐడియా.. తక్కువ ఖర్చుతో పర్యావరణాన్ని కాసింత సాయం చేసే ఇల్లు దొరకడమనేది గ్రేట్. మరి.. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ప్లాస్టిక్ ఇల్లు ఎలా ఉందో చూసేయండి..
(Video Courtesy: Telangana Today)