ఇంగ్లీష్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ పెట్టడానికి అసలు కారణం ఇది..!

-

మన ఫ్రెండ్ ఎవరైనా ఊరికే బోల్డ్ కంటెంట్ మాట్లాడుతుంటే..ఏంట్రా ఈ మధ్య ఇంగ్లీష్ మూవీల్ ఎక్కువ చూస్తున్నావా అంటుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ సినిమాలకు అంత క్రేజ్ ఉంది. పాటలు తక్కువ ఉంటాయి కానీ..బోల్డ్ కంటెంట్ మాత్రం వీరలెవల్ లో ఉంటుంది. ఫ్లైట్స్, గ్రాఫిక్స్ లాంటివి కూడా పిచ్చ క్వాలిటీలో ఉంటాయి. ఇక రొమాంటిక్ సీన్స్ గురించి వేరే చెప్పనక్కర్లేదు.

మనదేశంలో రొమాంటిక్స్ సీన్స్ పై కొన్ని నియమాలు ఉంటాయి. శృతిమించితే సెన్సార్ ఒప్పుకోదు. కానీ మరీ ప్రపంచదేశాలలో ఇంగ్లీష్ మూవీస్ లో అంత అడల్ట్ కంటెట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ సెన్సార్ ఎందుకు ఒప్పుకుంటుంది. మీకు ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా. వాళ్లు క్రేజ్ కోసమే, పబ్లిసిటీ కోసమో ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా.. అలా కాదంట..దాని వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది.

అమెరికా, జర్మనీ, జపాన్ తదితర దేశాల మనుషుల్లో ఆక్సిటోసిన్ చాలా తక్కువగా విడుదల అవుతుంది. అంటే లవ్ హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్లు రొమాంటిక్ సీన్స్ చూసినా కూడా వారికి ఎటువంటి ఫీలింగ్స్ రావట. అక్కడ ఉండే జనాలకి ఫీలింగ్స్ రావడం కోసం ఎంత వీలుంటే అంత అడల్ట్ కంటెంట్ తీయడానికి అక్కడి ప్రభుత్వం సినిమావాళ్లకు అనుమతి ఇచ్చింది. అలా ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి కూడా వేరే కారణం ఉంది. ఆ దేశంలో జరిగిన సర్వే ప్రకారం ప్రజల్లో ఫీలింగ్స్ తక్కువగా ఉండటంతో వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.

దాంపత్యంలో ఫీలింగ్స్ లేక..ప్రేమ తగ్గిపోయి..త్వరగా విడిపోతున్నారట. అందుకే సినిమాల్లో అలాంటి అడల్ట్ కంటెంట్ పెట్టి చాలా మంది వైవాహిక జీవితాన్ని నిలబెట్టాలని ప్రయత్నంతో కూడా ఇలాంటి సీన్స్ చిత్రీకరించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మన భారతదేశంలో అయితే ఆక్సిటోసిన్ ఎక్కువగా విడుదల అవుతుంది. అందుకే మనదేశంలో ప్రేమకోసం పిచ్చోళ్లు అయినవాళ్లు ఉన్నారు. ప్రాణాలు తీసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్లు లేకపోలేరు. ఎందుకంటే మనదగ్గర ప్రేమించిన వ్యక్తికోసం అంత పరితపిస్తుంటారు.

దీంతో ఇలాంటి ఎట్రాక్షన్స్ ని క్యాష్ చేసుకుని ఫారినర్స్ అడల్ట్ కంటెంట్ తీసి వెబ్‌సైట్స్ లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళకి కొన్ని కోట్లలో ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఆకర్షణ మాత్రమే కాదు. వస్తువులపై కూడా ఆకర్షణ ఎక్కువగానే ఉంటుంది. తమకు నచ్చిన వస్తువును ప్రాణంలా చూసుకుంటారు. కానీ ఇతర దేశాల్లో మాత్రం ఇద్దరు వ్యక్తులకు మధ్య మనదగ్గర ఉన్నంత ఎట్రాక్షన్ ఉండదు.

అలా ఇంగ్లీష్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఉంచటం వెనుక ఇంత బలమైన కారణాలు ఉన్నాయనమాట. మన దగ్గర ఈ లవ్ హార్మోన్ ఎక్కువగా ఉండటం ఒకందుకు మంచిదే అయినా..మరోపక్క అత్యాచారాలు కూడా ఎక్కువే కదా.

Read more RELATED
Recommended to you

Latest news