ఆ ఇంట్లో కొన్ని వేల తేళ్లు.. వైరల్ అవుతున్న వీడియో..!

-

తేళ్లు..సైజు చిన్నదే అయినా.. ఇవి మనుషుల ప్రాణాలు తీయగలవు. మన దగ్గర కూడా తేలు కుట్టి చనిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఎక్కువగా వర్షాకాలంలో పొలం పనులు చేసేప్పుడు తేళ్లు బయటకు వస్తాయి. అయితే మీరు తేళ్లను చూసే ఉంటారు. అంటే ఒకేసారి రెండో లేదా మూడు ఉంటాయి.. కానీ ఒక ఇళ్లంతా తేళ్లే ఉంటాయి. అసలు ఆ సీన్ ఎంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అదో మనుషులు వదిలేసిన ఇల్లు. చాలాకాలంగా అందులో ఎవరూ లేరు. మరి ఆ ఇంట్లో వస్తువులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఓ వ్యక్తి ఆ ఇంటి డోర్ తీశాడు. అంతే అక్కడ పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. ఎదురుగా ఇంట్లో ఎక్కడ చూసినా తేళ్లే. గోడలపై, ఫ్లోర్ పై అంతటా అవే. గ్యాప్ లేకుండా అల్లుకుపోయాయి. అవీ మాములు తేళ్లుకావు.. చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన తేళ్లే. వాటిని చూడగానే ఆశ్చర్యపోయిన అతను… వెంటనే వీడియో తీశాడు. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఇల్లు ఎక్కడుంది? ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారన్నది తెలియదు. అయితే.. ఈ వీడియోలో ఉన్న తేళ్లు తిత్యస్ సెర్రులాటస్ (Tityus Serrulatus) జాతికి చెందినవి అని నెటిజన్లలో కొందరు చెబుతున్నారు. ఇవి బ్రెజిల్‌కి చెందినవి మరికొందరు అంటున్నారు. ఈ రకం తేళ్లు పార్థేనోజెనిక్ (parthenogenic) టైపువి. అంటే… వీటికి సంతానాన్ని వృద్ధి చెయ్యాలంటే… మగ తేళ్లతో పని ఉండదు. అందువల్లే వీటి సంఖ్య త్వరగా పెరుగుతుందని కొందరు అంటున్నారు..
మొత్తానికి ఆ ఇళ్లంతా అలా తేళ్లు ఉన్నాయి. అవి ఇంట్లోంచి బయటకు వస్తే.. అక్కడ ఉండే మనుషులకు చాలా ప్రమాదం. విషపూరితమైనవి అంటున్నారు కాబట్టి.. మరి వాటిని తొలగిస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news