మెదడు షార్ప్‌గా ఉండాలంటే.. చెస్‌, సుడుకోనే కాదు.. శృంగారం కూడా ముఖ్యమే..!

-

మనిషికి ఆహారం, నిద్ర ఎంత ముఖ్యమో.. శృంగారం కూడా అంతే ముఖ్యం.. అందుకే కొంతమంది అంటారు.. సంభోగాన్ని మించిన సంతోషం ఇంకోటి ఉండదు.. శృంగారం అనేది ఏం అంత చెడ్డ పనికాదు.. ఇది మనిషికి ఒక నిత్య అవసరం లాంటిదే. సెక్స్‌ చేయడం వల్ల.. స్త్రీ, పురుషులు ఇద్దరి మానసిక స్థితి మెరుగుపడుతుంది. శృంగారం గురించి సైన్స్ చెప్పే కొన్ని ఇంట్రస్టింగ్‌ విష‌యాలు ఇప్పుడు చూద్దామా..

శృంగార జీవితం వ‌ల్ల అందం, ఆరోగ్యంతో పాటు తెలివితేట‌లు కూడా పొంద‌వ‌చ్చు. మెద‌డును చురుకుగా ఉంచుకోవ‌డానికి చెస్, ప‌జిల్స్, సుడోకు వంటి వాటిని ఆడుతూ ఉంటారు. కానీ శృంగారం వ‌ల్ల కూడా మెద‌డును చురుకుగా ఉంచుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా..? శృంగారం కార‌ణంగా మెద‌డులో కొత్త క‌ణాలు వృద్థి చెందుతాయ‌ట‌. అందువ‌ల్ల పెద్ద పెద్ద విష‌యాల‌ను కూడా గుర్తు పెట్టుకునే సామ‌ర్థ్యం పెర‌గ‌డంతో పాటు ప్ర‌తి విష‌యాన్ని కూడా ఆలోచించే తెలివితేట‌లు పెరుగుతాయ‌ని సైన్స్ చెబుతుంది. శృంగారం కార‌ణంగా మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. తరచూ సెక్స్‌ చేయడం వల్ల.. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతుంది.

శృంగార సమయంలో మెదడు చురుకుగా ఉండాలంటే ఏం తినాలంటే..

డార్క్ చాక్లెట్స్‌ను ఎక్కువ‌గా తినే వారు, త‌ర‌చూ దాంప‌త్య సుఖాన్ని అనుభ‌వించే వారిలో మెద‌డు ప‌నితీరు చురుకుగా ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ చాక్లెట్స్ తిన్న‌వారిలో అసిటోసిన్ ర‌సాయ‌న స్థాయిలు పెరిగి ఏడు ర‌కాలైన శృంగార‌ మార్పులు సంభ‌వించి వారి మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుందట.. ఇక ఈ చాక్లెట్‌లో ఉన్న మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచి మెద‌డుకు జ‌రిగే హానిని అడ్డుకుంటాయ‌ట‌. కేవ‌లం డార్క్ చాక్లెట్లు తిన‌డం వ‌ల్ల‌నే కాదు చేప‌లు తిన‌డం వ‌ల్ల కూడా సంభోగ స‌మ‌యంలో మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంద‌ట‌. కాబ‌ట్టి మెద‌డుకు ప‌ని పెట్టేందుకు చెస్, సుడోకుల‌తో పాటు శృంగారంపై కూడా దృష్టి పెట్టాల‌ని నిపుణులు చెబుతున్నారు. మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే.. సెక్స్‌ లైఫ్‌ మీ ఇద్దరికి నచ్చాలి.. ఇద్దరు సంతృప్తి చెందాలి.!

Read more RELATED
Recommended to you

Latest news