చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తుని అనుసరిస్తే చాలా సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండేందుకు అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఆవ నూనె తో ప్రతిరోజు దీపం పెడితే చాలా మంచి కలుగుతుంది శని దేవుడు కి రోజూ ఆవ నూనె తో దీపాన్ని పెట్టి శ్లోకాలను చదువుకుంటే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకున్నప్పటికీ అది కుదరకపోవచ్చు అలాంటివాళ్లు సొంత ఇంటిని కట్టుకోవాలని అనుకుంటే వాస్తు ప్రకారం ఇలా అనుసరించడం మంచిది అప్పుడు తప్పక సొంత ఇంటిని కట్టుకోవచ్చు.
అలానే వాస్తు శాస్త్రం ప్రకారం వేప చెక్కతో చిన్న ఇల్లు చేసి పేదలకి కానీ గుళ్లో కానీ పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక బాధల నుండి బయట పడచ్చు. సొంత ఇల్లు కల కూడా నెరవేరుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ యంత్రాన్ని పెట్టడం వలన చక్కటి ఫలితం పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
ఆవుకి బియ్యం బెల్లం మంగళవారం నాడు పెడితే కూడా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పాలు, పంచదార, నెయ్యి, కర్పూరం, పెరుగు, తేనె నవరాత్రి ఆఖరి రోజున పెట్టి నవరన మంత్రాలని దుర్గాదేవికి చదివితే కూడా సొంతింటి కల నెరవేరుతుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి సొంత ఇంటి కలని నెరవేర్చుకోండి ఆనందంగా జీవించండి.