కోహినూర్ వజ్రం తిరిగి మన దగ్గరకి ఎందుకు రావడం లేదంటే…?

-

కోహినూర్ వజ్రం పేరు అందరు వినే ఉంటారు. కానీ దీని చరిత్ర గురించి చాల మందికి తెలియదు. అయితే ఇది అసలు ఎక్కడ పుట్టుంది…? ఇప్పుడు ఎందుకు మన దగ్గరకి రావడం లేదు..? దానికి అంత విలువ ఎందుకు..? ఇలా అనేక విషయాలు మీకోసం. పూర్తి వివరాల్లోకి వెళితే… కోహినూర్ వజ్రం మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరుగనుల్లో దొరికింది అని పురావస్తు శాఖ వారు చెబుతున్నారు. అలానే ఈ వజ్రం గురించి చూస్తే… ఇది 105 క్యారట్లు కలిగి ఉంది. ఇది ప్రపంచం లోనే అతి పెద్ద వజ్రమని చెబుతుంటారు.

కోహినూరు వజ్రం తెలుగు వారి అమూల్య సంపదకూ, మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. కోహినూర్ అంటే పారశీక భాషలో కాంతి పర్వతం (కోహ్=పర్వతం, నూర్=కాంతి). బ్రిటిష్‌ రాణి కిరీటం లో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య ఇది ఉంది. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు. 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహా రాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది.

ఈ వజ్రాన్ని ధరించిన మగవారికి శాపముగా, ఆడువారికి మేలు చేకూర్చునట్లు చెప్పబడుతుంది. అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ బ్రిటన్ రాణి మాత్రం ఈ వజ్రాన్ని వదిలిపెడ్డం లేదట. అయితే మొదటిగా దక్కించుకున్న వ్యక్తి మాల్వా రాజు మహలక్ దేవ్. కాలాం తరం లో చివరికి ఈ వజ్రంను బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడట. ఈ వజ్రంని మన దేశానికీ ఇచ్చేయాలని ఎన్ని సార్లు అడిగిన తగిన రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుండి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news