ఆడవాళ్లకు బంగారం, కొత్త బట్టలు అంటే ఎంత ఇష్టమో.. కాస్త డబ్బులు ఎక్కువ ఉంటే చాలు.. వాళ్ల దృష్టి అంతా బంగారం వైపే ఉంటుంది. ఎంత ఉన్నా సంతృప్తి చెందరు. అయితే రాజస్థాన్‌లో ఓ ఫెస్టివల్ నిర్వహిస్తారు.. ఆ ఫెస్టివల్‌లో ఆడవాళ్లు ఎంత వీలైతే అంత ఎక్కువ బంగారు ధరించి పోటీల్లో పాల్గొంటారట.. ఆ బంగారం చూసేందుకు మీ రెండు కళ్లూ సరిపోవట..అంత వేసుకుంటారు..
రాజస్థాన్‌లో బార్మర్ ప్రాంతంలో థార్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఇక్కడ 40 నుంచి 50 తులాల బంగారు ఆభరణాలు ధరించి మహిళలు పోటీల్లో పాల్గొంటారు. అందరికన్న అందంగా కన్పించేందుకు ప్రయత్నింస్తుంటారు. పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా సంస్కృతి, వారసత్వం, జానపద కళలను సజీవంగా ఉంచడానికి థార్ మహోత్సవ్‌ను ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు.
అందమైన కాస్ట్యూమ్ ధరించి ర్యాంప్ మీద నడిచే అమ్మాయిలను చూసి ఉంటాం.. కానీ వీళ్లు బంగారం ధరించి వస్తారు.. వీరిని చూడటానికి పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. థార్ ఫెస్టివల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ థార్ బ్యూటీగా మారడం అనే టైటిల్. డజన్ల కొద్దీ అమ్మాయిలు బంగారు ఆభరణాలు ధరించి థార్ పండుగకు చేరుకుంటారు. వేలిగోరు నుంచి కాలి గోరు వరకు బంగారు ఆభరణాలతో పాటు ప్రత్యేకంగా వెండి కడియాలు, కంకణాలు, వలపాలను కూడా ధరిస్తారు.
ఈ పోటీదారులు చైన్, ఆర్మ్‌లెట్, వీల్, నాథ్, టికా, నడుము బ్యాండ్, హ్యాండ్ ఫ్లవర్, ట్రియో, జీలం, కాన్‌పట్టి, యూనిక్, ఫీనీ వంటి రెండు డజన్లకు పైగా బంగారు ఆభరణాలను ధరించి థార్ ఫెస్టివల్‌కు చేరుకుంటారు.. మొత్తం 30 మంది పోటీదారులు కోటి కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు ధరించి ఈవెంట్‌లో పాల్గొనడానికి వస్తారట.
ఈ ఆభరణాలు పోతాయేమోనన్న శ్రద్ధ, భయం కారణంగా, చాలా మంది పాల్గొనేవారి బంధువులు కూడా ఒకచోట చేరి వాటిని చూసుకుంటారు. థార్ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు వచ్చిన మనీషా సోనీ మాట్లాడుతూ రాజస్థాన్ జానపద సంస్కృతికి థార్ మహోత్సవం చాలా ముఖ్యమైనదని అన్నారు. ఆమె స్వయంగా 35-40 తులాల బంగారు ఆభరణాలు ధరించి వచ్చింది.
అందాల భామ కావడానికి వారం రోజులుగా సిద్ధమవుతోందని చెప్పింది. మరోవైపు, గత సంవత్సరం కూడా తాను థార్ బ్యూటీగా మారడానికి ప్రయత్నించానని హీనా చెప్పింది. బికనీర్‌కు చెందిన కోమల్ సిద్ధా మాట్లాడుతూ, బికనీర్‌లో మిస్ మార్వాన్, జైసల్మేర్‌లోని మారు మహోత్సవ్ తర్వాత, ఇప్పుడు ఆమె బార్మర్‌లోని థార్ మహోత్సవ్‌లో పాల్గొనడానికి వచ్చినట్లు చెప్పారు. మూడు ఉత్సవాల్లో పాల్గొని 35 తులాల బంగారు ఆభరణాలు, సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొనడం వల్ల ఆమెకు థార్ సుందరి అనే బిరుదును ఇచ్చారట