వాస్తు: రాత్రిపూట చెట్లని పట్టుకుంటే ఈ ఇబ్బందులు వస్తాయి..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి చెట్లకి సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు.

ఈ తప్పులని అసలు ఎవరు చెయ్యకూడదని ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. మరి వాస్తు పండితులు చెప్పిన అద్భుత విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం చెట్ల ని కానీ మొక్కలను కానీ ముట్టుకోకూడదు దీనికి గల కారణం ఏమిటంటే వేదాలలోను పురాణాలలోనూ చెట్లని మొక్కలని కూడా మనుషుల్లాగే భావించాలి అని చెప్పారు.

అయితే మొక్కలు చెట్లు కూడా రాత్రి నిద్ర పోతాయని వాటిని ముట్టుకోవడం పాపం అని పండితులు అంటున్నారు. అలానే రాత్రి పూట చెట్ల ఆకులని కోయకూడదు. సైంటిఫిక్ గా చూసుకుంటే రాత్రి పూట చెట్లు మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ని విడిచి పెడతాయి ఇది మనకి హాని చేస్తుంది కాబట్టి రాత్రి పూట చెట్లని మొక్కలని అనవసరంగా ముట్టుకుని ఇబ్బందులు పడకండి.

Read more RELATED
Recommended to you

Latest news