వీడియో వైరల్: వైకల్యం అడ్డుకాదని.. ఒంటికాలితోనే స్కూల్ కు వెళ్తున్న బాలిక..

-

సోషల్ మీడియాలో ఎప్పూడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. సంథింగ్ ఇంట్రస్టింగ్ ఉన్నవే అలా జరుగుతుంటాయి.. ఇప్పుడు కూడా ఓ పదేళ్ల బాలిక వీడియో నెట్టింట చెక్కర్లుకొడుతుంది.. కారణం.. ఒంటికాలిపై మండుటెండలో.. భుజాన పుస్తకాలు వేసుకుని స్కూల్ కు వెళ్లడం. ఆమె మనోధైర్యానికి, సంకల్పానికి చూసినవాళ్లంతా సలాం కొడుతున్నారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
బిహార్‌లోని జుమాయ్‌ జిల్లాకు చెందిన సీమాకు రెండేళ్ల క్రితం ఓ ప్రమాదం జరగ్గా.. వైద్యులు ఆమె ఎడమ కాలును తొలగించారు.
చదువు పట్ల ఆమెకు ఇష్టం ఏమాత్రం తగ్గలేదు. పుస్తకాల సంచిని బుజానికి వేసుకోని.. ఒంటికాలితోనే ప్రతిరోజు కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్తుంది. ఆమె ఒంటికాలితో స్కూలుకు వెళ్లే దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా విశేష స్పందన వచ్చింది. అనేకమంది ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ప్రముఖులు, అధికారులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

ముందుకొచ్చిన సోనూసూద్‌..

ఆపదలో ఉన్నవారికి ఆపద్భాంధవుడిలా నిలిచిన సోనూసూద్ సైతం ఈ వీడియో చూసి స్పందించారు. సీమా ఒంటికాలిపై నడుస్తున్న వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ఇకపై ఆమె ఒక కాలితో కాకుండా రెండు కాళ్లతో పాఠశాలకు పరిగెడుతుందని హామీ ఇచ్చారు. సీమా కోసం టికెట్లు పంపిస్తున్నానని పేర్కొన్నారు. సీమాపై వచ్చిన కథనాలపై అంతకుముందే వైద్య శాఖ స్పందించింది. అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. ఆమెకు కృత్రిమ కాళ్లను అమర్చాలని నిర్ణయించారు.
రెండేళ్ల క్రితం సీమాను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దెబ్బతిన్న కాలిని పూర్తిగా తీసేయాలని వైద్యులు నిర్ణయించి, ఆమె ఎడమ కాలిని తొలగించారు. అయితే ఆపరేషన్ తర్వాత సీమా వేగంగానే కోలుకుంది. దివ్యాంగురాలిననే భావన దరిచేరకుండా సొంతంగా తన పనులు చేసుకునేది.. ఎవరికీ భారం కాకూడదని ఒంటికాలితో గెంతుకుంటూనే స్కూల్​కు వెళ్తోంది. టీచర్లు సైతం సీమా పట్టుదలను చూసి మెచ్చుకునేవారట.
అలా సీమా కష్టాన్ని సోషల్ మీడియాకు పరిచయం చేయడంతో.. దాతలు ముందుకొచ్చి సాయం అందించారు. జీవితంలో ఏదైనా కష్టం వస్తే చాలామంది.. అమాంతం కుంగిపోతారు. ఇక అక్కడితో లైఫ్ అయిపోయింది అనుకుంటారు. పదేళ్ల వయసులోనే సీమా.. అంత ధైర్యంగా ఉండి.. దివ్యాంగురాలిని అనే భావన కలగకుండా.. ముందుకు అడుగుల వేసింది. నేటి తరానికి ఇలాంటి అమ్మాయిలు చాలా అవసరం.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news