విరాట్ కోహ్లీ.. అఫీషియల్ యాప్ రిలీజయింది..!

-

Virat Kohli launches his own app named ‘Virat Kohli Official App’ on birthday

హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఇవాళ. తన 30 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన అఫీషియల్ యాప్‌ను లాంచ్ చేశాడు. దాని పేరే విరాట్ కోహ్లీ అఫీషియల్ యాప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఆ యాప్ గురించి వివరాలన్నింటినీ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. తన యాప్ గురించి వీడియో చేశాడు. ఈ యాప్‌లో కోహ్లీకి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆయన పరుగులు వివరాలు, టూర్ వివరాలు, మ్యాచుల వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. తన సోషల్ మీడియా ఖాతాలన్నీ ఈ యాప్‌తో కనెక్ట్ చేయబడి ఉండటంతో కోహ్లీ సోషల్ మీడియాలో ఏం షేర్ చేసినా… వెంటనే ఈ యాప్ ద్వారా తెలిసిపోతుంది.

ప్రతి సంవత్సరం మీరు నా బర్త్‌డే రోజున నా మీద ఎంతో ప్రేమ కనబరుస్తారు. ఈసారి నా బర్త్‌డేకు, దీపావళికి నేను మీకు తీపి కబురు అందిస్తున్నాను.. అంటూ యాప్‌కు సంబంధించిన వీడియో పెట్టి తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు కోహ్లీ. ఈ మధ్య కోహ్లీ క్రికెట్‌ను మరింతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండిస్‌తో సిరీస్‌లోనూ కోహ్లీ బాగా రాణించాడు. సిరీస్ కైవసంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

Virat Kohli launches his own app named ‘Virat Kohli Official App’ on birthday

Read more RELATED
Recommended to you

Latest news